హీరో అయిన 26 ఏళ్లకి మొదటి హిట్టు!

హీరో అయిన 26 ఏళ్లకి మొదటి హిట్టు!

 హీరో అయిన ఇరవయ్యేరాళ్లకి మొదటి హిట్టు కొట్టడమేంటి? హిట్టు లేకుండా అన్నాళ్లు అతడిని హీరోగా చూసిందెవరు? అనుకుంటున్నారా. తమిళ హీరో విజయ్‌ గురించి ఈ అప్‌డేట్‌. తెలుగునాట హిట్టు కొట్టాలనేది విజయ్‌కి చాలా కాలంగా వున్న కల. తమిళంలో అగ్ర హీరో అయినా కానీ మిగతా తమిళ హీరోల్లా తెలుగులో మార్కెట్‌ సాధించలేకపోయాడు. రజనీకాంత్‌, కమల్‌, విక్రమ్‌, సూర్య, అజిత్‌, విశాల్‌ తదితర తమిళ హీరోలందరికీ ఇక్కడ గ్యారెంటీ మార్కెట్‌ వున్నా కానీ రజనీకాంత్‌ తర్వాత రజనీ అంతటోడు అనిపించుకున్న విజయ్‌కి మాత్రం తెలుగు ప్రేక్షకుల ఆదరణ దక్కలేదు.

అతని హిట్‌ సినిమాలని మన హీరోలు రీమేక్‌ చేసేయడమో, లేదా మన హీరోల హిట్‌ సినిమాలని అతను రీమేక్‌ చేయడమో చేయడం వల్ల విజయ్‌కి ఇక్కడ రాణించే స్కోప్‌ దక్కలేదు. కొంతకాలంగా ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని పనిగట్టుకుని తన సినిమాలన్నీ తెలుగులోకి అనువదిస్తున్నాడు. తుపాకి, అదిరింది, పోలీసోడు లాంటి చిత్రాలు యావరేజ్‌ అయ్యాయి. కత్తిని అనువదిద్దామని చూస్తే దాని రీమేక్‌ రైట్స్‌ తీసేసుకుని ఖైదీ నంబర్‌ 150 తీసేసారు. అందుకే సర్కార్‌ రీమేక్‌ రైట్స్‌ ఎవరికీ అమ్మకుండా జాగ్రత్త పడ్డాడు. ఎలాగైనా అనువదించి విడుదల చేయాలని పట్టుబట్టాడు. ఎట్టకేలకు విజయ్‌ కల నెరవేరింది. తమిళంలో హీరో అయిన ఇరవయ్యేరాళ్లేలకి తెలుగులో విజయ్‌కి మొదటి హిట్టు దక్కింది. ఇక మీదట విజయ్‌ సినిమాలన్నీ ఇక్కడ అనువాదమై మన వారి దృష్టిని ఆకట్టుకునే అవకాశాలే ఎక్కువ కనుక ఈ ఆరంభంతో విజయ్‌ ఇక విజయ పరంపర సాగిస్తాడనే ఆశిద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English