నిఖిల్ ముద్ర పడేది ఆ రోజే..

నిఖిల్ ముద్ర పడేది ఆ రోజే..

తెలుగులో ప్రస్తుతం హిట్ చాలా అవసరమైన యువ కథానాయకుల్లో నిఖిల్ ఒకడు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రంతో పెద్ద విజయాన్ని అందుకున్న నిఖిల్.. ఆ తర్వాత ‘కేశవ’.. ‘కిర్రాక్ పార్టీ’ సినిమాలతో నిరాశ పరిచాడు. ఈ రెండు సినిమాలు అతడి మార్కెట్‌ను దెబ్బ తీశాయి. ఇప్పుడతను ‘ముద్ర’ సినిమా చేస్తున్నాడు.


ఇది తమిళంలో విజయవంతమైన ‘గణిదన్’ సినిమాకు రీమేక్. ఒరిజినల్ తీసిన టి.ఎన్.సంతోషే తెలుగులోనూ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కొంచెం ఆలస్యమైంది. సరైన రిలీజ్ డేట్ కోసం చూసి చూసి.. చివరికి డిసెంబరు 28వ తేదీకి ఫిక్సయ్యారు. ఈ రోజు రిలీజ్ డేట్‌తో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

ఫస్ట్ లుక్‌లో సినిమా టైటిల్ ‘ముద్ర’ అని మాత్రమే ఉంది. కానీ ఈ టైటిల్ విషయంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో దాని ముందు హీరో పేరు కూడా చేర్చి ‘నిఖిల్ ముద్ర’గా చేశారు.ఇంతకుముందు ఫస్ట్ లుక్‌లో హీరో నిఖిల్ ఒకడే కనిపించాడు. తాజా పోస్టర్లో కథానాయిక లావణ్య త్రిపాటికి కూడా చోటు దక్కింది. ఇందులో హీరో హీరోయిన్లిద్దరూ టీవీ జర్నలిస్టులుగా కనిపించనున్నారు. నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం మీద పోరాడే కుర్రాడిగా నిఖిల్ పాత్ర ఉంటుంది.

ఇటీవలే ‘పందెంకోడి-2’తో పలకరించిన ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తమిళంలో అధర్వ, కేథరిన్ థ్రెసా జంటగా నటించిన ఈ థ్రిల్లర్ మూవీ పెద్ద విజయమే సాధించింది.  క్రిస్మస్ సినిమాలకు.. సంక్రాంతి చిత్రాలకు మధ్య రాబోయే ఈ చిత్రం ఈ గ్యాప్‌ను ఎలా వాడుకుంటుందో చూడాలి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English