ఫ్లాప్‌ సినిమాని గుర్తు చేస్తోన్న బన్నీ న్యూ లుక్‌

ఫ్లాప్‌ సినిమాని గుర్తు చేస్తోన్న బన్నీ న్యూ లుక్‌

ప్రతి సినిమాకీ హెయిర్‌ స్టయిల్‌ మార్చేయడం అల్లు అర్జున్‌కి అలవాటు. నాపేరు సూర్యలో మిలటరీ పాత్ర పోషించడానికి గాను తలపై ఒక గాటు, కనుబొమ్మపై ఒక గాటు పెట్టుకుని కొత్తగా కనిపించాడు. ఆ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న అల్లు అర్జున్‌ మధ్యలో చాలా రకాల హెయిర్‌ స్టయిల్స్‌ ట్రై చేసాడు కానీ ఫైనల్‌గా ఒక లుక్‌కి ఫిక్స్‌ అయ్యాడు.

జుట్టు బాగా పెంచి వెనక్కి దువ్వేసిన ఈ న్యూ లుక్‌ అల్లు అర్జున్‌ నటించిన 'వరుడు' సినిమా హెయిర్‌ స్టయిల్‌ని గుర్తు చేస్తోంది. ఆర్య 2, వరుడులో దాదాపు ఇదే హెయిర్‌ స్టయిల్‌తో అల్లు అర్జున్‌ దర్శనమిచ్చాడు. మరి టాక్సీవాలా ఈవెంట్‌కి వచ్చిన ఈ లుక్‌నే త్రివిక్రమ్‌ సినిమాలోను కంటిన్యూ చేస్తాడా లేక ఏమైనా మారుస్తాడా అనేది ఇంకా తెలీదు. ఇదిలావుంటే టాక్సీవాలా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన బన్నీ యువ హీరో విజయ్‌పై ప్రశంసలు కురిపించాడు.

సహజమైన నటుడని, బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చి పెద్ద స్థాయికి చేరుకున్నాడని, అతని రౌడీ బ్రాండ్‌ డ్రస్‌ ధరించాలని అనుకుంటున్నానని అన్నాడు. త్రివిక్రమ్‌తో సినిమా ఓకే అయినా కానీ కథ, నిర్మాత విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ రాకపోవడం వల్ల బన్నీ సినిమా మొదలు కావడానికి ఎక్కువ టైమ్‌ పడుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English