సనా కోసం సల్మాన్‌ దిగాడు

సనా కోసం సల్మాన్‌ దిగాడు

కళ్యాన్‌రామ్‌ కత్తి, మనోజ్‌ నోకియా సినిమాలలో హీరోయిన్‌గా నటించిన సనా ఖాన్‌ పై ఇప్పుడు అరెస్టు వారెంట్‌ ఇష్యూ అయ్యింది. మళయాలం డర్టీ పిక్చర్‌ రీమేక్‌లో తన అందాలతో విపరీతింగా ఆకట్టుకున్న సనా, ఇప్పుడు తన కంత్రీ వేషాలతో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యింది. ఈవిడ గారి తమ్ముడి ప్రేమను అంగీకరించలేదని, ఒక టెన్త్‌ క్లాస్‌ చదువుతున్న అమ్మాయిని కిడ్నాప్‌ చేద్దామని ప్రయత్నించింది సనా ఖాన్‌.

కిడ్నాప్‌ గట్టం ఫెయిలవ్వడం, ఆ తరువాత ఆ యువతి తల్లి పోలీసు కేసు పెట్టడంతో, సనాఖాన్‌ కజిన్‌ను అతడి స్నేహితులను అరెస్టు చేశారు పోలీసులు. ఇక సనా ఖాన్‌ను కూడా అరెస్టు చెయ్యాల్సి ఉండగా, ఆమె రెండు వారాల నుండి తప్పించుకొని తిరుగుతోంది. ఇక ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ 'మెంటల్‌' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇప్పుడు స్వయానా మన స్టార్‌ హీరో రంగంలోకి దిగాడు. ఆమెను బిగ్‌బాస్‌ షో లో చూశాను, అంత కఠినమైన అమ్మాయిగా కనిపించలేదు, పైగా అలా జనం మధ్యలో కిడ్నాప్‌ చెయ్యాలని ఎందుకు అనుకుంటుంది అంటూ రివర్స్‌లో చెరిగేశాడు.

ఏదో మీడియాకు, పోలీసులకు, అరెస్టు వారెంటుకు భయపడి దాక్కొని ఉంటుంది కాని, ఆవిడ చాలా మంచిది అంటూ కితాబిచ్చాడు. అయితే ఇదంతా విన్నవారు మాత్రం భాగం నవ్వుకుంటున్నారు. మీ చుట్టూ ఉన్న కోర్టు కేసులు గురించే ఏమీ చెప్పలేకపోతున్నారు, ఇక సనా ఖాన్‌ గురించి ఎందుకులేండి అంటూ సెటైర్లు వేస్తున్నారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు