'మీటూ'కి తల వంచిన సూపర్‌స్టార్‌

'మీటూ'కి తల వంచిన సూపర్‌స్టార్‌

మీటూ ఉద్యమంలో భాగంగా ముందుగా బయటకి పొక్కిన ప్రముఖుల పేర్లలో వున్నాడు దర్శకుడు వికాస్‌ భాల్‌. హృతిక్‌ రోషన్‌తో 'సూపర్‌ 30'లాంటి భారీ చిత్రానికి తుది మెరుగులు దిద్దుతోన్న టైమ్‌లో అతని పేరుపై మరక పడింది. దీనిని పావుగా తీసుకుని హృతిక్‌ని ద్వేషించే ఒక వర్గం ఆ దర్శకుడిని మరింత టార్గెట్‌ చేసింది.

దీంతో ఆ దర్శకుడిని తొలగిస్తే తప్ప తన సినిమాకి ముప్పు వాటిల్లే ప్రమాదం వుందని హృతిక్‌ గ్రహించాడు. అందుకే సినిమా పూర్తయ్యే దశకి చేరుకున్నా కానీ షూటింగ్‌ ఆపేసి మరో దర్శకుడి కోసం గాలించాడు. ఫైనల్‌గా 'భజరంగి భాయ్‌ జాన్‌', 'ఏక్‌థా టైగర్‌' చిత్రాల దర్శకుడు కబీర్‌ ఖాన్‌ ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి ముందుకి వచ్చాడు. మరో పది శాతం షూటింగ్‌ మాత్రమే మిగిలివున్న ఈ చిత్రానికి ఇంకా పోస్ట్‌ ప్రొడక్షన్‌ మొదలు కాలేదు.

జనవరి 25న విడుదల చేయడానికి ప్లాన్‌ చేసిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌కి వాయిదా వేసారు. ఇప్పటికిప్పుడు మరో దర్శకుడి చేతిలో వుంచి హడావుడిగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ చేయడం వల్ల అవుట్‌పుట్‌ దెబ్బ తింటుందని రిలీజ్‌ ప్లాన్స్‌ మార్చుకున్నారు. ఈ చిత్ర దర్శకుడిపై నిందలలో తనవంతు చెయ్యేసి పరోక్షంగా హృతిక్‌ రోషన్‌పై తనకున్న అక్కసుని కంగన రనౌత్‌ తీర్చుకుందని బాలీవుడ్‌లో గుసగుసలాడుకుంటున్నారు.

ముందుగా 'సూపర్‌ 30' రిలీజ్‌ డేట్‌కే తన 'మణికర్ణిక' చిత్రాన్ని ప్రకటించిన కంగన ఇప్పుడు దానిని పోటీలోంచే తప్పించేసి తన సినిమాకి ఎదురు లేకుండా చేసుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English