ఇలియానా కోసం ఇంత ఇదిగా ఇదైపోతున్నారా?

ఇలియానా కోసం ఇంత ఇదిగా ఇదైపోతున్నారా?

ఒకప్పుడు తెలుగు చిత్ర సీమని రాణిలా ఏలేసిన గోవా సుందరి ఇలియానా బాలీవుడ్‌లో ఒక వెలుగు వెలగాలని తెలుగు సినిమాలని కాదని అటు వెళ్లిపోయింది. ఏళ్ల తరబడి బాలీవుడ్‌లో వున్నా ఒకటీ అరా సినిమాలే తప్ప ఇలియానా పెద్దగా సాధించిందంటూ ఏమీ లేకపోయింది. ఇక పెళ్లి చేసుకుని రిటైర్‌ అయిపోయే ఆలోచనలో వుండగా మరోసారి టాలీవుడ్‌నుంచి పిలుపు వెళ్లింది.

రవితేజతో 'అమర్‌ అక్బర్‌ ఆంటోని' చిత్రంలో నటించడానికి బల్క్‌ డేట్స్‌ ఇచ్చే హీరోయిన్‌ దొరక్క ఇలియానాతో రీఎంట్రీ చేయిస్తున్నారు. ఇక్కడ్నుంచి మాయమై చాలా కాలం అవుతున్నా కానీ ఇలియానాకి ఇక్కడ క్రేజ్‌ ఏమీ తగ్గలేదనేది ఆమె 'అమర్‌ అక్బర్‌ ఆంటొని' చిత్రం ఆడియో రిలీజ్‌ వేడుకలో ఇచ్చిన స్పీచ్‌కి వస్తోన్న వ్యూస్‌ చూస్తే అర్థమవుతోంది.

కొన్ని గంటల్లోనే ఈ స్పీచ్‌ వీడియోని పదిలక్షల మందికి పైగా చూసారు. ఇలియానా ఇప్పుడు ఎలా వుంది అనే క్యూరియాసిటీతోనే ఇంతమంది ఈ వీడియో చూసారనేది అర్థమవుతోంది. ఇలియానాకి వస్తోన్న ఈ స్పందన చూసి చిత్ర బృందం సంబరపడిపోతుంది. ఓపెనింగ్స్‌కి ఇలియానా ఫ్యాక్టర్‌ కూడా బాగా ప్లస్‌ అవుతుందని వారికి సంబరంగా వుంది.

గతంలో కంటే కాస్త ఒళ్లు చేసిన గోవా సుందరి ఈ చిత్రంలో తన డబ్బింగ్‌ తానే చెప్పుకుంది. అలాగని తెలుగు నేర్చేసుకుందని అనుకోకండి. ఆడియో ఫంక్షన్‌లో ఎప్పటిలా 'అంద్రీకీ నమష్కారం... ఎలా వున్నారు'కి మించి తెలుగు మాట్లాడలేకపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English