బ్యాడ్ బాయ్.. మళ్లీ హద్దులు దాటాడు

బ్యాడ్ బాయ్.. మళ్లీ హద్దులు దాటాడు

బాలీవుడ్లో వ్యక్తిగతంగా చాలా బ్యాడ్ ఇమేజ్ ఉన్న నటుల్లో సంజయ్ దత్ ఒకడు. అతడిపై ఉన్న వివాదాలకు లెక్కే లేదు. కొందరు సంజయ్ చాలా మంచి వాడని సర్టిఫికెట్లు ఇస్తుంటారు కానీ.. అతను మాత్రం తరచుగా వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటాడు. మీడియాపై తరచుగా నోరు జారడం సంజుకు అలవాటు. తాజాగా దీపావళి వేడుకల సందర్భంగా సంజయ్ దత్ ఒక ఫొటోగ్రాఫర్‌ను బూతులు తిట్టడం చర్చనీయాంశమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐతే ఈ విషయంలో పూర్తిగా తప్పు సంజుదే అని చెప్పలేం. ఇంతకీ అసలేం జరిగిందంటే..

దీపావళి సందర్భంగా సంజయ్‌ దత్.. అతడి భార్య మాన్యతా దత్ తమ నివాసం వద్ద సన్నిహితులకు పార్టీ ఏర్పాటు చేశారు. దీని గురించి మీడియాకు సమాచారం రావడంతో కవరేజీ కోసం ఫొటోగ్రాఫర్లు వచ్చారు. ఐతే వాళ్లు ఫొటోల కోసం ఎగబడుతుండటంతో సంజయ్‌‌కి కోపం వచ్చింది. ‘దీపావళి కదా.. ఇంటికి వెళ్లండి. కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకోరా..’ అని సంజయ్‌ కొంచెం కోపంగా ప్రశ్నించాడు. దీనికి ఓ ఫొటోగ్రాఫర్‌ బదులిస్తూ.. ‘మా బాస్‌ ఈ రోజు కూడా పని చేయమన్నారు’ అన్నాడు. దీంతో సంజయ్ కోపం నషాళానికి అంటింది. ‘వెళ్లి వాడి ముఖం పగలగొట్టు...’ అంటూ రాయలేని భాషలో ఫొటోగ్రాఫర్ని తిట్టాడు. అసలు సంజయ్ ఈ పార్టీకి మీడియాను పిలవనట్లుంది. అలాంటపుడు అతడి ప్రైవసీని దెబ్బ తీయడం ఫొటోగ్రాఫర్ల తప్పే. కానీ సంజయ్ మరీ బూతులు తిడుతూ విరుచుకుపడటం విమర్శలకు దారి తీస్తోంది. అసలే బ్యాడ్ ఇమేజ్ ఉన్న సంజయ్ తాజా ఘటనతో మరింతగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English