ఇక ఆమిర్ ఖాన్ దానికే అంకితం

ఇక ఆమిర్ ఖాన్ దానికే అంకితం

చాలా ఏళ్ల తర్వాత మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్‌కు బాక్సాఫీస్ దగ్గర పెద్ద ఎదురు దెబ్బ తగలింది. ‘లగాన్’ దగ్గర్నుంచి ఆమిర్ ఖాన్ జైత్రయాత్ర మామూలుగా లేదు. మధ్యలో ‘ది రైజింగ్’ ఫ్లాప్ అయినా.. దాని ద్వారా కూడా గౌరవం సంపాదించుకున్నాడు ఆమిర్ ఖాన్. ఐతే ఇప్పుడు ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ పెద్ద డిజాస్టర్ కావడమే కాదు.. ఆమిర్ పరువు తీసింది కూడా. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ నుంచి జనాలు ఇలాంటి సినిమాను అస్సలు ఊహించలేదు. రికార్డు స్థాయి బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్న సినిమా కాస్తా.. ఫెయిల్యూర్ రికార్డుల్ని తిరగరాసేలా ఉంది. ఆమిర్ కెరీర్‌కు ఇదొక మచ్చలా మిగిలిపోయేలా కనిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసే ఉద్దేశం కూడా ఆమిర్‌కు లేనట్లుగా ఉంది. రిలీజ్ తర్వాత సినిమా ఊసే ఎత్తట్లేదతను. సైలెంటుగా అమెరికాకు వెళ్లిపోతున్నాడు.

తన కలల ప్రాజెక్టు ‘మహాభారతం’ మీద ఇక ఆమిర్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతున్నాడు. కొన్నేళ్ల పాటు అతను ఈ చిత్రానికే అంకితం కాబోతున్నాడు. తన టెక్నికల్ టీంతో కలిసి అతను అమెరికాకు వెళ్లాడు. అక్కడే సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్.. ప్రి ప్రొడక్షన్ పనులు పర్యవేక్షించబోతున్నాడట. ఏడు భాగాలుగా ‘మహాభారతం’ తీయడానికి ఆమిర్ సన్నాహాలు చేసుకుంటుండటం విశేషం. ఏడు భాగాలకు ఏడుగురు దర్శకులు దర్శకత్వం వహిస్తాడట. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఆమిర్ ఇందులో శ్రీకృష్ణుడి పాత్ర పోషిస్తాడట. వివిధ భాషల నుంచి నటీనటుల్ని ఈ సినిమాకు ఎంపిక చేసుకోనున్నారు. రెండేళ్ల తర్వాత తొలి భాగం ప్రేక్షకుల ముందుకు రావొచ్చని అంచనా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English