వాళ్లు సరిపోదని నిర్మాతలు కూడా చేరారు

వాళ్లు సరిపోదని నిర్మాతలు కూడా చేరారు

సినీ రంగంలో సెంటిమెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందరూ సక్సెస్ ఫుల్ కాంబినేషన్లనే కుదర్చడానికి ప్రయత్నిస్తుంటారు. ఫ్లాపుల్లో ఉన్నవాళ్లతో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపించరు. కానీ కొందరు మాత్రం ఇందుకు మినహాయింపు.

హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో సత్తా చాటిన మైత్రీ మూవీ మేకర్స్ ఆశ్చర్యకరంగా డిజాస్టర్లలో కొట్టుమిట్టాడుతున్న దర్శకుడు శ్రీను వైట్ల, హీరో రవితేజ కాంబినేషన్లో 'అమర్ అక్బర్ ఆంటోనీ' అనే సినిమా మొదలుపెట్టింది. ఈ చిత్రానికి కథానాయికగా ఎంపికైన ఇలియానా సైతం ఫ్లాపుల్లోనే ఉంది. ఐతే వాళ్ల సంగతెలా ఉన్నా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్లాక్ బస్టర్లతో దూసుకెళ్తుండటంతో వాళ్ల సెంటిమెంటు కలిసొస్తుందని అనుకున్నారు.  కానీ ఇప్పుడు వాళ్ల కథ కూడా అడ్డం తిరిగింది. 'సవ్యసాచి'తో ఈ నిర్మాతలు సైతం డిజాస్టర్ రుచి చూశారు.

మొత్తానికి 'అమర్ అక్బర్ ఆంటోని' విషయంలో ఫ్లాప్ కాంబినేషన్ పరిపూర్ణం అయింది. డిజాస్టర్ వీరులందరూ కట్టగట్టుకుని రాబోతున్నారు. అసలే ఈ సినిమాకు అంతగా బజ్ లేదంటే.. సరిగ్గా విడుదలకు కొన్ని రోజుల ముందు నిర్మాతల మీద ఉన్న భరోసా కూడా పోవడంతో బయ్యర్లలో ఈ సినిమా పట్ల భయం పట్టుకుంది.

ఈ మధ్యే విడుదలైన దీని టీజర్ కూడా కొత్తగా ఏమీ అనిపించలేదు. శ్రీను వైట్ల ఎప్పట్లాగే ఒకకమర్షియల్ సినిమా ట్రై చేసినట్లున్నాడు. ఈ రోజుల్లో ఈ తరహా సినిమాలకు చాలా కష్టమైపోతోంది. టాక్ ఏమాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తోంది చిత్ర బృందం. ఈ సినిమా ఆడకుంటే మాత్రం దర్శకుడు శ్రీను వైట్ల, హీరో రవితేజల కెరీర్లకు మామూలు దెబ్బ కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English