ఇది ఫ్లాపయితే ఆ డైరెక్టర్‌ ఇక ఇంటికే

ఇది ఫ్లాపయితే ఆ డైరెక్టర్‌ ఇక ఇంటికే

శ్రీను వైట్ల వరుసగా ఆగడు, బ్రూస్‌లీ, మిస్టర్‌ లాంటి దారుణమైన చిత్రాలని అందించినపుడు ఇక ఆయన పని అయిపోయిందనే అనుకున్నారు. ఒక టైమ్‌లో అదిరిపోయే బ్లాక్‌బస్టర్లు తీసిన శ్రీను వైట్ల తర్వాత సక్సెస్‌ ఎలా తీయాలనే దానిపై కనీస అవగాహన కూడా లేనట్టు కనిపించాడు. దీంతో మిస్టర్‌ తర్వాత చాలా కాలం శ్రీను వైట్లకి అవకాశాలు రాలేదు. ఇలాంటి టైమ్‌లో రవితేజతో వున్న అనుబంధం అతనికి కలిసి వచ్చింది. రవితేజని నీకోసంతో హీరోని చేసిన శ్రీను వైట్ల ఆ తర్వాత అతనితో వెంకీ, దుబాయ్‌ శీను చిత్రాలు తీసాడు. ఆ అనుబంధంతో వైట్లకి అవకాశాలు లేనపుడు రవితేజ పిలిచి మరీ ఛాన్స్‌ ఇచ్చాడు.

రవితేజకి రెండు సినిమాలకి అడ్వాన్స్‌ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్‌ అతనే సెట్‌ చేసిన 'అమర్‌ అక్బర్‌ ఆంటొని' ప్రాజెక్ట్‌ని కాదనలేకపోయారు. తన పంథా మార్చేసి ఏదో కొత్త రకం సినిమా తీసానని శ్రీను వైట్ల చెబుతున్నాడు కానీ టీజర్‌లో అయితే ఎలాంటి ప్రత్యేకతలు కనిపించలేదు. ఈ చిత్రం కనుక మిస్‌ ఫైర్‌ అయితే అటు హీరో రవితేజకి కానీ, ఇటు నిర్మాతలకి కానీ వచ్చే నష్టం ఏమీ లేదు. దీంతో చివరి లైఫ్‌ లైన్‌ని శ్రీను వైట్ల వాడేసుకున్నట్టు అవుతుంది కనుక ఖచ్చితంగా హిట్‌ కొట్టి తీరాలి. లేదంటే తన గత చిత్రాలు చేసిన డ్యామేజ్‌ వల్ల ఇప్పుడింకో ఫ్లాప్‌ పడితే మళ్లీ తనని నమ్మి పెట్టుబడి పెట్టడానికి ఎవరూ రాకపోయే ప్రమాదముంది. ఆ టెన్షన్‌తోనో ఏమో శ్రీను వైట్ల ఈ చిత్రం విషయంలో లో ప్రొఫైల్‌ మెయింటైన్‌ చేస్తున్నాడనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English