చైనాని ఊపేస్తోన్న మన సినిమా

చైనాని ఊపేస్తోన్న మన సినిమా

భారతీయ చిత్రాలకి చైనా మార్కెట్‌లో మంచి గిరాకీ ఏర్పడింది. అయితే స్టార్స్‌ వున్న సినిమాలని, మన వాళ్లు తీసే సోది మసాలా చిత్రాలని వారు ఆదరించడం లేదు. కథా బలం వుండి, ఎమోషనల్‌గా కనక్ట్‌ అయ్యే ఇండియన్‌ సినిమాలకి మాత్రమే చైనాలో కోట్లు రాలుతున్నాయి. దంగల్‌ చైనాలో వెయ్యి కోట్లకి పైగా గ్రాస్‌ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. సీక్రెట్‌ సూపర్‌స్టార్‌, బజరంగి భాయ్‌జాన్‌, హిందీ మీడియం చిత్రాలు కూడా చైనాలో విజయ దుందుభి మోగించాయి. తాజాగా హిచ్‌కీ అనే హిందీ చిత్రం చైనా మార్కెట్‌లో అలజడి సృష్టిస్తోంది.

నాలుగు వారాల్లో నూట యాభై కోట్లకి పైగా గ్రాస్‌ కలక్షన్లతో చైనాలో అతి పెద్ద విజయాన్ని అందుకున్న భారతీయ చిత్రాల్లో ప్రస్తుతం అయిదవ స్థానంలో వుంది. రాణి ముఖర్జీ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం లో బడ్జెట్‌లో రూపొందింది. ఇక్కడ విమర్శకుల ప్రశంసలు అందుకుని ఇండియాలో యాభై తొమ్మిది కోట్ల వసూళ్లు సాధించింది. చైనాలో దానికి మూడింతలు వసూలు చేయడంతోనే ఇది అక్కడ ఎంత పెద్ద విజయమనేది స్పష్టమవుతోంది. చైనాలో ఎలాంటి సినిమాలని ఆదరిస్తున్నారనే దానిపై ఇప్పుడో ఐడియా రావడంతో ఈ తరహా చిత్రాలని చైనా మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని మరిన్ని తెరకెక్కించే అవకాశాలు బాగా వున్నాయి. యుఎస్‌ కంటే చైనానే పెద్ద మార్కెట్‌గా ఇండియన్‌ సినిమాకి మారిపోయే రోజులు ఎంతో దూరంలో లేవనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English