అందరినీ కెలుక్కుంటోన్న హీరో

అందరినీ కెలుక్కుంటోన్న హీరో

తెలుగులో ఒక వెలుగు వెలిగి తర్వాత తమిళ రంగానికి షిఫ్ట్‌ అయి ప్రస్తుతం అవకాశాలు ఎక్కువ లేక ఖాళీగా వుంటోన్న నటుడు సిద్ధార్థ్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నాడు. కరంట్‌ హాట్‌ టాపిక్‌ ఏది నడుస్తున్నా దానిపై సిద్ధార్థ్‌ తన అభిప్రాయాన్ని వ్యంగ్యంగా తెలియజేస్తున్నాడు. ఎవరైనా ప్రముఖులు తప్పు చేస్తే వారిని నిలదీస్తూ ట్వీట్లు వేస్తున్నాడు. దీని వల్ల సదరు వ్యక్తుల అభిమానులు తనపై దాడి చేసినా కానీ సిద్ధార్థ్‌ తగ్గడం లేదు. మొన్నటికి మొన్న 'మీటూ' ఉద్యమం వేడి మీద వున్నపుడు వారూ వీరని కాకుండా ఎవరి పేర్లయితే బయటకి వచ్చాయో అందరి మీదా సిద్ధూ ఎటాక్‌ చేసాడు. తాజాగా కోహ్లీపై కూడా సిద్ధార్థ్‌ విమర్శలు గుప్పించాడు.

ఎప్పుడూ లేనిది ప్రతి వివాదంలోను సిద్ధార్థ్‌ వేలు పెడుతోంటే ఇతను కూడా ప్రకాష్‌రాజ్‌ మాదిరిగా రాజకీయాల్లోకి వచ్చి అధికారంలో వున్న వారిని ఎండగట్టే ప్రయత్నాల్లో వున్నాడా అనిపిస్తోంది. మంచి విద్యావంతుడు అయిన సిద్ధార్థ్‌ అద్భుతమైన వక్త కూడా. అతను ఆంగ్లంలో స్పీచ్‌ ఇస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఎలాగో సినిమాల్లో భవిష్యత్తు కనిపించకపోవడంతో ఇలా ప్రతి విషయంపై తన వ్యంగ్యాస్త్రాలు సంధించి తద్వారా వార్తల్లో వుంటూ నెమ్మదిగా రాజకీయ తెరంగేట్రం చేయడానికి సిద్ధార్థ్‌ ప్లాన్‌ చేస్తున్నాడా? అతని తీరు చూస్తోన్న చాలా మంది ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు కానీ సిద్ధార్థ్‌ మాత్రం దానిపై ఎలాంటి కామెంట్‌ చేయలేదింకా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English