రంగస్థలం ఫ్లాప్‌ అయి వుంటే...

రంగస్థలం ఫ్లాప్‌ అయి వుంటే...

'వినయ విధేయ రామ' టీజర్‌ చూసి హార్డ్‌ కోర్‌ అభిమానులు చాలా హ్యాపీగా వున్నారు కానీ 'రంగస్థలం' తర్వాత చరణ్‌ నుంచి వైవిధ్యం ఆశించిన వారు మాత్రం పెదవి విరుస్తున్నారు. బోయపాటి శ్రీను ఎలాంటి సినిమానైతే తెరకెక్కిస్తాడని భావించారో టీజర్‌ అలాగే వుండడంతో కొందరికి ఈ చిత్రంపై ఆసక్తి సన్నగిల్లింది. అయితే ధృవకి ముందు ఇలాంటి మసాలా చిత్రాలు చేయరాదని డిసైడ్‌ అయిన చరణ్‌ ఇప్పుడు ఎందుకు ఈ అటెంప్ట్‌ చేసినట్టు? నిజానికి 'రంగస్థలం' మేకింగ్‌లో వుండగా ఓకే అయిన ప్రాజెక్ట్‌ ఇది. రంగస్థలంలో చరణ్‌ ప్రయోగానికి పూనుకుంటున్నాడని, ఫలితం ఏదైనా నటుడిగా పేరొస్తే చాలని భావిస్తున్నాడని చిరంజీవి ప్రత్యేకంగా బోయపాటి శ్రీనుని పిలిపించి సెట్‌ చేసిన ప్రాజెక్ట్‌ ఇది.

అందుకే రంగస్థలం రిలీజ్‌ కాకముందే ఈ చిత్రాన్ని మొదలు పెట్టేసారు. అయితే రంగస్థలం అనూహ్య విజయాన్ని అందుకుని అంచనాలని మించిపోయింది. కానీ అప్పటికే మొదలు పెట్టిన ఈ చిత్రాన్ని పూర్తి చేయక తప్పింది కాదు. మొదట్లో చరణ్‌ అసలు ఆసక్తి చూపించకపోయినా నెమ్మదిగా కుదురుకుని సినిమా పూర్తి చేసాడు. రాజమౌళి తీస్తోన్న మల్టీస్టారర్‌ పూర్తవడానికి టైమ్‌ వుంది కనుక ఈలోగా అభిమానులకి ఉత్సాహం ఇచ్చినట్టు అవుతుందని ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి మాస్‌ సినిమాగా మలిచేసారట. అలా రంగస్థలం ఫెయిలైన పక్షంలో ఇన్సూరెన్స్‌గా పనికి వస్తుందని చేసిన ఈ ప్రాజెక్ట్‌కి ఇప్పుడు రంగస్థలంతో వచ్చిన ఇమేజే అడ్డంకి అవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English