వరుణ్‌ తేజ్‌లో కొత్త కోణం

వరుణ్‌ తేజ్‌లో కొత్త కోణం

వరుణ్‌ తేజ్‌ ఇప్పటికి నటుడిగా పలు రకాల ప్రయోగాలు చేసేసాడు. ఒకే తరహా మూసలో పడిపోకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యం కోసం ప్రయత్నిస్తూ రిస్కులు కూడా చేస్తున్నాడు. ఫిదా, తొలిప్రేమ హిట్టయిన తర్వాత ఎవరైనా సేఫ్‌గా లవ్‌స్టోరీలకి స్టిక్‌ అవుతారు. కానీ వరుణ్‌ తేజ్‌ 'అంతరిక్షం' అనే స్పేస్‌ థ్రిల్లర్‌ చేస్తున్నాడు. ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌కి నటన పరంగా పెద్దగా వచ్చే పేరేమీ వుండదంటున్నారు కానీ ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నాడు కనుక కల్ట్‌ ఫాలోయింగ్‌ పెరగవచ్చు.

అదలా వుంచితే ఇంతవరకు ఏ చిత్రంలోను కామెడీ పాత్ర పోషించని వరుణ్‌ తేజ్‌ మొదటి సారి పూర్తిస్థాయి కామెడీ పాత్రలో 'ఎఫ్‌ 2'లో కనిపించబోతున్నాడు. వెంకటేష్‌తో కలిసి వరుణ్‌ నటిస్తోన్న అనిల్‌ రావిపూడి చిత్రానికి కామెడీనే హైలైట్‌ అట. ఆది నుంచి అంతం వరకు ఈ చిత్రం కామెడీతోనే వుంటుందని, అనిల్‌ రావిపూడి ఈ చిత్రాన్ని వినోదంతో నింపేసాడని టాక్‌. వరుణ్‌ తేజ్‌ ఇంతకుముందు ఏ సినిమాలోను చూపించని కామెడీ కోణాన్ని ఇందులో చూపిస్తున్నాడట. ఇక కామెడీ సీన్స్‌లో వెంకీ ఎలా చెలరేగిపోతాడనేది తెలిసిందే. మొత్తం మీద ఈ ఇద్దరూ కలిసి ఈ చిత్రాన్ని నవ్వుల విందుగా మలిచారని, ఈ చిత్ర బృందం ఎఫ్‌ 2 విజయంపై చాలా ధీమాగా వుందని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English