త్రివిక్రమ్‌ మాయలో పడని అల్లు అర్జున్‌

త్రివిక్రమ్‌ మాయలో పడని అల్లు అర్జున్‌

నా పేరు సూర్య తర్వాత చాలా గ్యాప్‌ వచ్చింది కదా, త్రివిక్రమ్‌తో సినిమా ఓకే అయింది కదా అని వెంటనే దానిని మొదలు పెట్టడానికి అల్లు అర్జున్‌ సుముఖంగా లేడు. త్రివిక్రమ్‌ ఎప్పుడూ లైన్‌ చెప్పేసి, హీరోతో ఓకే అనిపించుకుని ఇక సినిమాని మొదలు పెట్టేస్తాడు. ఇంతకుముందు అల్లు అర్జున్‌తో చేసిన సినిమాలకి కూడా అలాగే చేసాడు. కానీ ఈసారి మాత్రం అల్లు అర్జున్‌ అంత ఈజీగా ఒప్పుకోవడం లేదు. త్రివిక్రమ్‌ లైన్‌ ఓకే చేసినా కానీ ఫుల్‌ స్క్రిప్ట్‌ ఓకే అయ్యాకే మొదలు పెట్టాలని అంటున్నాడు.

త్రివిక్రమ్‌ ఇటీవల ఫామ్‌లో లేడనేది తెలిసిందే. అరవింద సమేత చిత్రానికి కూడా త్రివిక్రమ్‌ డైరెక్షన్‌ వీక్‌ అనే టాక్‌ బాగా వినిపించింది. ఆ సినిమా ఫైనల్‌గా బ్రేక్‌ ఈవెన్‌ కాలేదన్నది కూడా అల్లు అర్జున్‌కి ఎరుకే. అందుకే బ్లయిండ్‌గా త్రివిక్రమ్‌ చెప్పిన దానికి తల ఊపేయకుండా తనకి సంతృప్తినిచ్చేలా స్క్రిప్ట్‌ సిద్ధమయ్యాకే సినిమా అంటున్నాడట. అన్నట్టు బన్నీ ఈమధ్య స్క్రిప్ట్‌ సెలక్షన్‌ టీమ్‌ పెట్టుకున్నాడు. ఏ కథని అయినా వీరు అప్రూవ్‌ చేయాలట. అందుకని తన బ్రాండ్‌ నేమ్‌తో హీరోని ఆట ఆడించేయడం అనేది ఈసారి త్రివిక్రమ్‌కి చెల్లదన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English