విమర్శలకి భయపడుతోన్న సాయిధరమ్‌తేజ్‌!

విమర్శలకి భయపడుతోన్న సాయిధరమ్‌తేజ్‌!

మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు ఎక్కువైపోవడంతో ఇప్పటికే వారిని క్రికెట్‌ టీమ్‌ అని, మరోటనీ ట్రోల్‌ చేస్తుంటారు. దీంతో ఈ జనరేషన్‌లో కొత్తగా ఆ ఫ్యామిలీ నుంచి రావడానికి కాస్త జంకుతున్నారు. ఒకవేళ ఎవరైనా హీరోలు అవుతున్నా కానీ వారిని మిగతా వాళ్లు ప్రమోట్‌ చేయడం లేదు. మెగా మేనల్లుడిగా ఘనమైన ఎంట్రీ దక్కించుకున్న సాయిధరమ్‌ తేజ్‌ ఇప్పుడు తన తమ్ముడు హీరోగా పరిచయం కావడాన్ని అంతగా ఇష్టపడడం లేదట.

అయితే అతనికి అవకాశాలు వచ్చినపుడు, అతనికి ఆసక్తి వున్నపుడు కాదని చెప్పలేడు కనుక సైలెంట్‌గా వున్నాడు. సుప్రీమ్‌ హీరో అనే బిరుదు తనకిస్తేనే మెగా ఫాన్స్‌ ఇష్టపడలేదు. అలాగే చిరంజీవి పాటలని రీమిక్స్‌ చేస్తున్నా కూడా విసుక్కున్నారు. పైగా ఇప్పుడు వరుసగా పరాజయాలు చవిచూస్తున్నాడు. ఈ టైమ్‌లో మరో హీరోని చిరంజీవి పేరు చెప్పి దించితే ఫాన్స్‌ ఎలా రియాక్ట్‌ అవుతారనేది సాయిధరమ్‌ తేజ్‌కి తెలుసు. అందుకే తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ని షాడోలో వుంచేస్తున్నాడు. తెరవెనుక అతనికి సపోర్ట్‌ చేస్తున్నాడా లేదా అనేది తెలియదు కానీ బహిరంగంగా అయితే తమ్ముడిని హీరోగా నిలబెట్టేందుకు సాయిధరమ్‌ తేజ్‌ ఎలాంటి ఎఫర్ట్స్‌ పెట్టడం లేదనేది ఇండస్ట్రీ టాక్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English