పెళ్లయిందనే సీక్రెట్‌ దాచిపెట్టిన టాప్‌ హీరోయిన్‌?

పెళ్లయిందనే సీక్రెట్‌ దాచిపెట్టిన టాప్‌ హీరోయిన్‌?

పలుమార్లు ప్రేమలో పడి లేచిన నయనతార ప్రస్తుతం తమిళ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. మొదట్లో అతనితో ప్రేమాయణాన్ని దాచి పెట్టిన నయనతార తర్వాత ఓపెన్‌గానే కనిపించడం స్టార్ట్‌ చేసింది. ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు వుండలేనంతగా కలిసి పోయిన నయన, విఘ్నేష్‌ చాలా కాలంగా సహ జీవనం కూడా చేస్తున్నారు. నయనతారకి ఖాళీ దొరికినపుడల్లా ఆమెతో కలిసి అతను విదేశీ టూర్లకి వెళుతుంటాడు. వీరిద్దరూ కేవలం సహ జీవనం మాత్రం చేయడం లేదని, పెళ్లి చేసేసుకున్నారనేది తమిళ మీడియాలో వినిపిస్తోన్న పుకారు.

నయనతార ప్రస్తుతం చాలా బిజీగా వుంది. సోలోగా నటిస్తూ తమిళంలో చాలా విజయాలు అందుకుంటోంది. ప్రస్తుతం ఫుల్‌ ఫామ్‌లో వున్న తనకి పెళ్లయిందనే విషయం బయట పడితే ఆ క్రేజ్‌ తగ్గుతుందని భావించి పెళ్లయిన విషయాన్ని గుట్టుగా వుంచారని, కొంత కాలం తర్వాత లాంఛనంగా పెళ్లి చేసుకుని వివాహాన్ని అఫీషియల్‌ చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. విఘ్నేష్‌తో లవ్‌ సీక్రెట్‌ కాకపోయినా కానీ దాని గురించి మీడియాతో మాట్లాడ్డానికి నయనతార అసలు ఇష్టపడదు. నిజానికి ఆమె తన సినిమాల ప్రమోషన్లకి కూడా మీడియాని మీట్‌ అవదు. ఏ సినిమానీ ప్రమోట్‌ చేయనని నయనతార ముందుగానే ఒప్పందంలో రాసుకుని మరీ సంతకం చేస్తుందట!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English