బోయపాటి ఆటలు సాగనివ్వలేదు

బోయపాటి ఆటలు సాగనివ్వలేదు

'వినయ విధేయ రామ' అని చరణ్‌ సినిమాకి బోయపాటి శ్రీను నామ కరణం చేయడం వెనుక ఒక కారణముంది. మాస్‌ సినిమాని క్లాస్‌ మార్కెటింగ్‌తో ప్రమోట్‌ చేయాలనేది బోయపాటి ప్లాన్‌. ఇంతకుముందు జయ జానకీ నాయక విషయంలో కూడా ఇదే చేసాడు కానీ అది వర్కవుట్‌ అవలేదు. దాంతో చరణ్‌ సినిమాకి మళ్లీ అదే స్కెచ్‌ వేసాడు. టైటిల్‌ విషయంలో ఎలాగైతేనేమి మెగా ఫ్యామిలీని ఒప్పించేసి తను పెట్టాలనుకున్నదే పెట్టేసాడు.

అయితే ఈ చిత్రం మార్కెటింగ్‌ విషయంలో మాత్రం బోయపాటి ఆటలు చెల్లడం లేదు. 'సరైనోడు'కి చేసినట్టుగా పక్కా మాస్‌ సినిమాగానే ప్రమోట్‌ చేయాలి తప్ప క్లాస్‌ సినిమా అనే భ్రమ కల్పించరాదని చరణ్‌ గట్టిగా డిసైడ్‌ అయ్యాడు. అందుకే ఫస్ట్‌ లుక్‌ పంచెకట్టుతో సాంప్రదాయబద్ధంగా ప్లాన్‌ చేసినా కానీ చివరకు కత్తి పట్టిన స్టిల్లే బయటకి వచ్చింది. అలాగే టీజర్‌లోను ఎమోషన్‌ టచ్‌ ఇవ్వాలని బోయపాటి చూస్తే అసలు దాని జాడే లేకుండా పూర్తిగా హీరోయిజమ్‌ మాత్రమే వుండేలా చూసారు. ఒక సినిమా ఎలా వుంటుందనే దానిపై సరయిన అంచనాలు రేకెత్తిస్తే ప్రేక్షకులు నిరాశ పడరనేది చరణ్‌ వాదన.

రంగస్థలం చిత్రంలో తన పాత్రకి వినిపించదనేది దాచి వుంచాలని తొలుత భావించినా అది సబబు కాదని ముందే దానిని రివీల్‌ చేసేసారు. దాంతో ఆ చిత్రానికి ఎలాంటి అంచనాలతో రావాలనేది అభిమానులు కూడా ముందే ఫిక్స్‌ అయిపోవడం వల్ల సినిమా చూసి ఎవరూ నిరాశ చెందలేదు. అందుకే 'వినయ విధేయ రామ' విషయంలోను ఎలాంటి గిమ్మిక్స్‌ లేకుండా ఫెయిర్‌గా ప్రమోట్‌ చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English