బెల్లంకొండ బాబు కొత్త సినిమా టైటిల్

బెల్లంకొండ బాబు కొత్త సినిమా టైటిల్

హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. చివరగా ‘సాక్ష్యం’ సినిమాతో తల బొప్పి కట్టించుకున్న శ్రీనివాస్.. ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. సమాంతరంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలు చివరి దశలో ఉన్నాయి. అందులో ముందుగా శ్రీనివాస్ మామిడి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న థ్రిల్లర్ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి టైటిల్ ఖరారైంది. ‘కవచం’ అనే పేరును దీనికి ఫిక్స్ చేశారు. అలాగే దీని ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఐదో సినిమా ఇది. తొలిసారిగా ఇందులో పోలీస్ పాత్ర పోషిస్తున్నాడతను. మంచి హైట్, ఫిజిక్ ఉన్న శ్రీనివాస్ పోలీస్ పాత్రకు బాగానే సూటయ్యాడు. అతడి లుక్ బాగుంది.

ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, మెహ్రీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. బెల్లంకొండ గత సినిమాలతో పోలిస్తే ఈ చిత్రం భిన్నంగా ఉంటుందట. భారీతనం, కమర్షియల్ హంగులు తగ్గించి కథే ప్రధానంగా సినిమాను నడిపించారంటున్నారు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అని చెబుతున్నారు. వంశధార క్రియేషన్స్ బేనర్ మీద నవీన్ సొంటినేని ఈ చిత్రాన్ని నిర్మించాడు. థమన్ సంగీతాన్నందించాడు. డిసెంబర్లోనే ‘కవచం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీనివాస్ దీంతో పాటుగా సీనియర్ దర్శకుడు తేజ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ కాజల్ అగర్వాలే కథానాయిక. ఆ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొస్తుందట. ఓవర్ బడ్జెట్ కారణంగా, మంచి టాక్ తెచ్చుకున్న ‘అల్లుడు శ్రీను’, ‘జయ జానకి నాయక’ చిత్రాలతో కూడా ఫెయిల్యూర్లు చవిచూసిన శ్రీనివాస్.. తన కొత్త సినిమాలతో అయినా ఆశించిన ఫలితాలందుకుంటాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English