'బద్రి'ని గుర్తుకు తెచ్చిన రామ్ చరణ్

'బద్రి'ని గుర్తుకు తెచ్చిన రామ్ చరణ్

మెగా అభిమానుల నిరీక్షణకు తెరపడింది. రామ్ చరణ్ కొత్త సినిమా ‘వినయ విధేయ రామ’ టీజర్ ఈ రోజే రిలీజైంది. మాస్‌లో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న రామ్ చరణ్.. ఊర మాస్ డైరెక్టర్‌గా గుర్తింపున్న బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలుంటాయో అందుకు తగ్గట్లే ఉంది ఈ టీజర్. ఆరంభం నుంచి చివరిదాకా హీరో ఎలివేషన్ షాట్లే ఉన్నాయిందులో.

ఇక ఈ టీజర్‌కు హైలైట్‌గా నిలిచిన.. అందరి నోళ్లలోనూ నానుతున్న డైలాగ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘‘నువ్వు పందెం పరమేశ్ అయితే ఏంట్రా.. ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల’’. మామూలుగా చిరంజీవి కానీ.. పవన్ కళ్యాణ్ కానీ.. రామ్ చరణ్ కానీ.. తమ ఇంటి పేరును చెప్పుకోవడం అరుదు. ఐతే చరణ్ మాత్రం ఏకంగా సినిమాలో తన క్యారెక్టర్‌కు సొంత పేరుతో సహా ఇంటి పేరును వాడేశాడు.

ఇక పైన పేర్కొన్న డైలాగ్ వినగానే మెగా అభిమానులకు ‘బద్రి’ సినిమాలో పవర్ స్టార్ చెప్పిన ఫేమస్ డైలాగ్ గుర్తుకు రాకుండా పోదు. అందులో ప్రకాష్ రాజ్ నందా ఇక్కడ అంటే.. ‘‘నువ్వు నందా అయితే.. నేను బద్రి బద్రీనాథ్’’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్ పేలుస్తాడు పవన్ అందులో. దాదాపుగా అదే స్టయిల్లో చరణ్ ఇప్పుడు డైలాగ్ పేల్చడం.. పైగా కొణిదెల అనే ఇంటి పేరు కూడా పలకడంతో మెగా అభిమానులకు టీజర్‌తోనే పూనకాలు వచ్చేస్తున్నాయి.

సినిమాలో ఈ డైలాగ్ వచ్చినపుడు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ‘ధృవ’.. ‘రంగస్థలం’ సినిమాలతో కొంచెం క్లాస్ బాటలో నడిచిన చరణ్.. ఈసారి పాత స్టయిల్లో మాస్ విందు వడ్డించడానికి రెడీ అయినట్లుంది. బోయపాటి కూడా పూర్తిగా తన స్టయిల్లోనే సినిమా తీసినట్లున్నాడు. మరి ఈ మెగా మాస్ మూవీ ప్రేక్షకులకు సంక్రాంతి సీజన్లో ఎలాంటి వినోదం పంచుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English