ట్యాక్సీవాలా.. తెర వెనుక ఏం జరిగింది?

ట్యాక్సీవాలా.. తెర వెనుక ఏం జరిగింది?

ఎప్పుడో మే నెలలో రావాల్సిన సినిమా ‘ట్యాక్సీవాలా’. కొన్ని కారణాల వల్ల వాయిదా పడి వచ్చే శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మేలో సినిమాను రిలీజ్ చేయాలనుకున్నపుడు హీరో విజయ్ దేవరకొండ ఒక చిన్న పిల్లల గ్యాంగ్‌ను పెట్టుకుని వెరైటీ ప్రమోషనల్ వీడియోలు వదలడం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఆ గ్యాంగ్‌తో కలిసి చక్కటి వీడియోతో జనాల ముందుకొచ్చాడు విజయ్. ‘ట్యాక్సీవాలా’ సినిమాకు ఇంకా ఎడిటింగ్ పూర్తి కాకముందే పైరసీ చేసి ఆన్ లైన్లో లీక్ చేసేసిన సంగతి తెలిసిందే. దీన్ని ఉద్దేశించి ఈ వీడియోను తయారు చేశారు. ఈ పిల్లల గ్యాంగ్ విజయ్ ఇంట్లోకి వచ్చి.. ట్యాక్సీవాలా యావరేజ్ అంట కదా అంటుంది. దానికి విజయ్.. ఇంకా రిలీజే కాలేదు అప్పుడే యావరేజ్ అంటారేంటి అని ప్రశ్నిస్తాడు. దానికి వాళ్లు సినిమా లీకైందని చెబుతారు.

అప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కాకుండా సినిమా చూసి కామెంట్ చేయడమేంటి అంటూ.. ఒక సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ ఎంత అవసరమో ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాడు. ముందుగా ఉడికించని పాస్తాను టేస్ట్ చూపించి.. ఆ తర్వాత దానికి అవసరమైన దినుసులు, మసాలాలు అద్ది ఉడికించి తర్వాత రుచి చూపిస్తాడు. పోస్ట్ ప్రొడక్షన్ కాని సినిమా వండని తిను బండారం లాంటిదని.. వంట వండాక దాని రుచి ఎలా వేరుగా ఉంటుందో ఎడిటింగ్, డీఐ, మిక్సింగ్ అన్నీ అయ్యాక సినిమా ఫీల్ కూడా వేరు అని ఈ వీడియో ద్వారా భలే చెప్పాడు విజయ్ దేవరకొండ. చివరగా థియేటర్ ఫీల్‌ కూడా సినిమాకు ఎంత ముఖ్యమో కూడా చెప్పే ప్రయత్నం జరిగింది. మొత్తంగా మరోసారి విజయ్ అండ్ టీమ్ ప్రమోషన్లతో తమ క్రియేటివిటీ చూపించి జనాల దృష్టిని ఆకర్షించింది. ‘ట్యాక్సీవాలా’ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English