మళ్లీ కెలికేసారు... మళ్లీ బ్లాక్‌బస్టరు?

మళ్లీ కెలికేసారు... మళ్లీ బ్లాక్‌బస్టరు?

విజయ్‌ సినిమా రావడం, దానిని తమిళనాడు సర్కారు కెలికేయడం చాలా కామన్‌ సీన్‌ అయిపోతోంది. విజయ్‌ ప్రతి సినిమాకీ సర్కారునుంచి ఏదో ఒక సమస్య ఎదురవుతోంది. మెర్సల్‌ చిత్రంలో కొన్ని డైలాగులపై అభ్యంతరం చెప్పి ఉన్న క్రేజ్‌ని పదింతలు చేసి దానిని బ్లాక్‌బస్టర్‌ చేసేసారు. తాజాగా 'సర్కార్‌' థియేటర్ల వద్ద రాజకీయ రచ్చ జరుగుతోంది. ఉచితంగా వస్తువులు పంచే అలవాటున్న ఏఐఏడిఎంకే పార్టీపై ఇందులో సున్నిత విమర్శలున్నాయి. ఒక సీన్‌లో ఉచితంగా పంచిన గ్రైండర్లని ప్రజలు మంటల్లో విసిరేస్తారు. ఆ సీన్‌ స్వయంగా దర్శకుడు మురుగదాసే చేసాడు. ఇది ప్రభుత్వ వ్యతిరేక చర్య అని, విజయ్‌ నక్సలైట్‌లా వ్యవహరిస్తున్నాడని తమిళ నాయకులు విమర్శిస్తున్నారు.

ఆయా సన్నివేశాలు తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. థియేటర్ల వద్ద కటౌట్లు నేలకి ఒరిగాయి. అంతంత మాత్రం టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రానికి ఇది ఫ్రీ పబ్లిసిటీగా పని చేస్తోంది. దీంతో ఈ చిత్రం థియేటర్ల వద్ద రద్దీ మరింత పెరగడం గ్యారెంటీ. విజయ్‌ గత చిత్రాలకి కాంట్రవర్సీలు దోహదపడినట్టే మళ్లీ ఈ వ్యవహారం అతడికి పూర్తిగా కలిసి వచ్చేలా వుంది. ఇప్పటికే విజయ్‌ ఫాన్స్‌ యాక్టివ్‌ అయిపోయి తమిళనాడు గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా నేషనల్‌ వైడ్‌గా సోషల్‌ మీడియా ట్రెండింగ్‌ చేసేస్తున్నారు. ఇలాంటి వివాదాల వల్ల ఎవరిపై అయితే కోపముందో వారికే మంచి చేస్తున్నామని రాజకీయ నాయకులు గ్రహించకపోవడం విడ్డూరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English