చైతన్య సిట్యువేషన్‌ వెరీ బ్యాడ్‌

చైతన్య సిట్యువేషన్‌ వెరీ బ్యాడ్‌

వరుసగా మూడు పరాజయాలు చవిచూసిన నాగచైతన్య సిట్యువేషన్‌ ఇప్పుడు అస్సలు బాలేదు. చాలా కాలంగా మార్కెట్‌ పెంచుకోలేకపోతోన్న చైతన్య కెరియర్‌ని 'శైలజారెడ్డి అల్లుడు', 'సవ్యసాచి' చిత్రాలు మరో లెవల్‌కి తీసుకెళతాయనే అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా నాని, శర్వానంద్‌, విజయ్‌ దేవరకొండ, వరుణ్‌ తేజ్‌ లాంటి హీరోల రాకతో చైతన్య తన సత్తా చాటుకోవాల్సిన అవసరం పెరిగింది. ఇలాంటి తరుణంలో తన సత్తా చాటే చిత్రాలు ఇవే అవుతాయని అభిమానులు బలంగా నమ్మారు. చైతన్య కూడా శైలజారెడ్డి అల్లుడు చిత్రంపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. అయితే విడుదలకి ముందు భారీ అంచనాలు రేకెత్తించిన ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద చతికిల పడింది.

దాని తర్వాత వచ్చిన సవ్యసాచి మరింత దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. అంతకుముందు 'యుద్ధం శరణం' అసలు ఎవరికీ గుర్తు రానంతగా ఫ్లాపయింది. ప్రస్తుతం చైతన్య చేస్తోన్న చిత్రంపై అంతగా అంచనాలు లేవు. సమంతతో కలిసి 'నిన్ను కోరి' దర్శకుడు శివ నిర్వాణతో చైతన్య ఓ చిత్రం చేస్తున్నాడు. దానిపై సవ్యసాచి లేదా శైలజారెడ్డి అల్లుడు స్థాయి హోప్స్‌ అయితే లేవు. ఈ రెండు పరాజయాల తర్వాత అంచనాలు ఏర్పడే అవకాశాలు కూడా లేవు. అసలే పోటీ తీవ్రంగా వున్న టైమ్‌లో చైతన్యకి వచ్చిన ఈ సెట్‌ బ్యాక్స్‌ నుంచి త్వరగా కోలుకుని సోలోగా తనేంటో చూపించాల్సిన అవసరం చాలా వుంది. వేగంగా సినిమాలు చేసేసే అలవాటున్న చైతన్య కాస్త స్లో అయి అయినా ఈ పరిస్థితిని మార్చుకోవాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English