ఫోటోలు లీకయ్యాయా... లీక్‌ చేసారా?

ఫోటోలు లీకయ్యాయా... లీక్‌ చేసారా?

తన ప్రైవేట్‌ ఫోటోలు లీక్‌ అయ్యాయంటూ కమల్‌హాసన్‌ చిన్న కూతురు అక్షర హాసన్‌ పోలీసులని ఆశ్రయించింది. అంతే కాకుండా ఈ న్యూస్‌ని రిపోర్ట్‌ చేసిన వారికి నైతిక విలువలు లేవంటూ కామెంట్‌ చేసింది. అసలు అలాంటి భంగిమల్లో ఎందుకు ఫోటోలు దిగాల్సి వచ్చిందనేది పక్కన పెడితే ఎవరైనా ఒక నటి మొబైల్‌ని ఎలా హ్యాక్‌ చేస్తారు? సోషల్‌ మీడియా అకౌంట్లు హ్యాకింగ్‌కి గురవుతుంటాయి కానీ ఇలా మొబైల్‌ హ్యాకింగ్‌ అనేది జరగలేదు. అప్పట్లో హాలీవుడ్‌ నటీమణుల్లో చాలా మంది ప్రైవేట్‌ వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఐ క్లౌడ్‌ హ్యాకింగ్‌కి గురవడం వల్ల జెన్నిఫర్‌ లారెన్స్‌ లాంటి ప్రముఖ నటీమణుల గుట్టు రట్టయింది.

అది ప్రైవేట్‌ డాటా స్టోరేజ్‌ కనుక హ్యాక్‌ చేయడానికి కుదిరింది కానీ అక్కడ పర్సనల్‌గా ఎవరి మొబైల్స్‌ హ్యాక్‌ అవలేదు. ఒకవేళ అంత టెక్నాలజీయే వుంటే ప్రముఖ తారలకే ఈ తలపోటు ఎదురవుతుంది. దీంతో అక్షర హాసన్‌ చెబుతున్నట్టుగా మొబైల్‌ హ్యాకింగ్‌ అనేది పూర్తిగా విస్మరించవచ్చు. మరి ఫోటోలు బయటకు ఎలా వచ్చాయి? ఆమె మొబైల్‌ ఎవరైనా రాంగ్‌ పర్సన్‌ చేతిలో పడి వుండాలి లేదా ఆ ఫోటోలు షేర్‌ చేసిన వ్యక్తి వాటిని లీక్‌ చేసి వుండాలి. ఇదంతా ఫేమ్‌ కోసం కావాలని చేస్తున్నది అనే వాళ్లు కూడా సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నారు. అది వేరే సంగతి. శృతిహాసన్‌లా అక్షర నటిగా సక్సెస్‌ కాలేకపోయింది. ప్రస్తుతం చేతిలో అవకాశాలు లేవు. సడన్‌గా ఈ న్యూస్‌తో ఆమె హెడ్‌లైన్స్‌లోకి వచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English