నారా నో హిట్‌!

నారా నో హిట్‌!

ఉత్తమ కథా విలువలు వున్న చిత్రాలు చేస్తున్నాడనే పేరుతో నారా రోహిత్‌కి ఒక వర్గం ప్రేక్షుల్లో గుర్తింపు వుండేది. అతని సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్‌ అయినా కాకపోయినా కానీ చాలా చిత్రాలు రోహిత్‌కి మంచి పేరు తెచ్చి పెట్టాయి. రోహిత్‌ ఒక కథ ఓకే చేసాడంటే అందులో విశేషం వుండే వుంటుందని స్టార్‌ దర్శకులైన త్రివిక్రమ్‌, సుకుమారే అన్నారంటే అతనికి వున్న గుడ్‌విల్‌ ఎలాంటిదో అర్థమవుతుంది. అలాంటి నారా రోహిత్‌ ఈమధ్య అస్సలు సోది లోకి కూడా రాని సినిమాలు చేస్తున్నాడు. తన దగ్గరకి వచ్చిన ప్రతి కథని రోహిత్‌ అంగీకరించేస్తున్నాడేమో అనే భావన కలుగుతోంది.

కథాంశాల పరంగా వైవిధ్యం వుందో లేదో చూస్తున్నాడే తప్ప కంటెంట్‌ పనికొచ్చేదా కాదా అని అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ కారణంగా అతను చేసిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద తుడిచి పెట్టుకుపోతున్నాయి. రోహిత్‌ నటించిన ఇటీవలి చిత్రాలు అసలు రిలీజయ్యాయో లేదో కూడా తెలియనంతగా ఫ్లాపవుతున్నాయి. కథలో రాజకుమారి, ఆటగాళ్ళు, రీసెంట్‌గా వచ్చిన వీర భోగ వసంత రాయలు రోహిత్‌కి చెడ్డ పేరు తెచ్చి పెట్టాయి. ఇదివరకు అతని సినిమాలకి గ్యారెంటీ ఆడియన్స్‌ అంటూ వుండేవారు. ఇప్పుడు థియేటర్లలో ఈగలు, దోమలు తప్ప మనుషులు కానరావడం లేదు. ఇలాగే కొనసాగితే తర్వాత పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదు. పూర్తిగా డ్యామేజ్‌ జరగకముందే రోహిత్‌ మేలుకుంటే బెటరు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English