చరణ్‌ కోసం మళ్ళీ అదే కథా రామా!

చరణ్‌ కోసం మళ్ళీ అదే కథా రామా!

కొంతమంది సినిమాల్లో కథలుండవ్. కొంతమంది సినిమాల్లో క్యారక్టర్లు ఉండవ్. కాని కొందరు డైరక్టర్ల సినిమాల్లో మాత్రం ఒకటే కథ మళ్ళీ మళ్లీ ఉంటూ.. కొన్ని సంఘటనలు మాత్రం మారుతూ ఉంటాయి. కామ్ గా ఉండే ఒక కొడుకు.. సడన్ గా వయిలెంట్ అయిపోతాడు. ఇదే పాయింట్ ను రకరకాలుగా మార్చి కథలు అల్లుతుంటాడు మన బోయపాటి శ్రీను.

డైరక్టుగా మనం పాయింటులోకి వెళిపోతే.. ఆర్మీలో పనిచేసి వచ్చిన కొడుకు వయలెంట్ గా మారితే సరైనోడు అయ్యాడు. తన ప్రేమ కోసం కొడుకు వయిలెంట్ గా మారితే జయ జానకి నాయకా అన్నాడు. మరి ఇప్పుడు రామ్ చరణ్‌ హీరోగా వస్తున్న వినయ విధేయ రామా సినిమా కథ ఏంటో తెలుసా? ఇద్దరి అన్నదమ్ముల కథ అంటూ ఆల్రెడీ టాక్ వినిపిస్తోంది. కాని కాస్త 'జయ జానకీ నాయక' కథ చూస్తే.. ఒక తండ్రి.. ఇద్దరు కొడుకులు.. అందులో చిన్న కొడుకు కథే సినిమా. ఇప్పుడు కూడా మళ్లీ అదే తరహాలో ఒక తండ్రి.. ఇద్దరు కొడుకులు.. అందులో చిన్న కొడుకు కథే ఈ రాముడి కథ కూడా. ప్చ్!!

అయితే బోయపాటి మ్యాగ్జిమం కథ గురించి పెద్దగా వర్రీ అవ్వడు. ఆయన సినిమాను మనం చూస్తున్నప్పుడు కూడా కత గురించి ఫీలవ్వం. కాకపోతే ఎమోషనల్ సీన్లు.. వెంట్రుకలు నిక్కపొడుచుకునే రేంజు ఫైట్లు.. హీరోయిజం.. మాస్ ఎలిమెంట్స్ మాత్రమే చూస్తాం. సో చరణ్‌ సినిమాలో అవన్నీ పక్కాగే ఉంటే చాలు.. ఇది 100 కోట్లు బొమ్మ అవుతుంది అంటున్నారు మెగా ఫ్యాన్స్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English