సమంత తల్లైంది! అబ్బా ఏంటా నస

సమంత తల్లైంది! అబ్బా ఏంటా నస

వార్తలు అవే. కాని ప్రెజెంటేషన్ మాత్రం ఛానల్ ఛానల్ కూ మారపోతుంటుంది. ఒక ఛానల్లో స్ట్రయిట్ గా వినిపించిన వార్త.. మరో ఛానల్లో మాత్రం వేరే రకంగా కాస్త సెన్సేషనలైజ్ చేసి ఉండడం మనం చాలాసార్లు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సమంత తల్లైంది.. చైశ్యామ్ తల్లిదండ్రులయ్యారు వంటి హెడ్ లైన్.. ఆ విధంగానే సృష్టించబడింది.

సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాలో.. సమంత ఒక డైలాగ్ చెబుతుంది. ''అమ్మాయి పడిపోయింది అంటే.. ఎవరికి అంటారు. అమ్మాయి కాలుజారింది అంటే ఎవరితో అంటారు.. అందుకే మెట్ల మీద నుండి పడిపోయిన విషయం ఎవరికీ చెప్పకు'' అంటుంది. సరిగ్గా ఇప్పుడు సమంత కొనుక్కున్న కొత్త కుక్క పిల్ల విషయంలో అదే జరిగింది. ఆ విషయం అమ్మడు ఇనస్టాగ్రాములో పేర్కొందో లేదో.. సమంత ఒక బుజ్జి కుక్కపిల్లకు తల్లైంది అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.

ఇకపోతే హెడ్డింగ్ చూడగానే.. చాలామంది మాత్రం.. సమంత ఎవరినైనా సన్నీ లియోన్ తరహాలో ఎడాప్ట్ చేసుకుందా.. లేకపోతే మంచు లక్ష్మి టైపులో సరోగసి పద్దతిలో పిల్లను కనేసిందా అంటూ ఆశ్చర్యపడ్డారు. కాని చివరకు వార్తను చదివాక కుక్క పిల్ల కోసం ఇలాంటి హెడ్డింగ్ పెడతారా? ఇదేం నసరా నాయనా అంటూ తిట్టుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English