అఖిల్‌ సినిమా కొనేవారు లేరు

అఖిల్‌ సినిమా కొనేవారు లేరు

అక్కినేని అఖిల్‌ మొదటి సినిమా విడుదల కాకముందు మరో సూపర్‌స్టార్‌ వస్తున్నాడనే భావించారు. నాగ చైతన్య లాంఛింగ్‌ విషయంలో నాగార్జున మిస్టేక్‌ చేసారు కనుక అఖిల్‌ లాంఛ్‌ సరిగ్గా జరుగుతుందని భావించారు. కానీ అఖిల్‌ని లాంఛ్‌ చేసిన 'అఖిల్‌' డిజాస్టర్‌ అయింది. అలాగే అతడిని రీలాంఛ్‌ చేసిన 'హలో' కూడా కమర్షియల్‌గా ఫ్లాప్‌ అయింది. దీంతో అఖిల్‌ ఇక పెద్ద దర్శకులు, భారీ బడ్జెట్‌ల వెంట పడడం మానేసి మీడియం బడ్జెట్‌లో 'మిస్టర్‌ మజ్ను' అనే సింపుల్‌ లవ్‌స్టోరీ చేస్తున్నాడు.

టీజర్‌తో పాటు పోస్టర్లు విడుదలయినా కానీ ఇంకా ఈ సినిమాపై ఒక ఐడియా ఏర్పడలేదు. మొదటి రెండు సినిమాలు పోయి వుండడం వల్ల ఈ చిత్రానికి బజ్‌ రావడం లేదు. అందుకే సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్నా కానీ ఇంకా శాటిలైట్‌ డీల్‌ క్లోజ్‌ అవలేదు. మంచి ఆఫర్‌ వస్తుందని నిర్మాతలు ఎదురు చూస్తున్నారు కానీ ఈ చిత్రంపై ఎవరూ అంతగా మోజు పడడం లేదు. ఆడియో రిలీజ్‌ అయి, ట్రెయిలర్‌ వచ్చిన తర్వాత సినిమా సృష్టించే బజ్‌ని బట్టి ఈ చిత్రాన్ని కొనడానికి ముందుకి రావచ్చు. మొదటి రెండు సినిమాల విషయాల్లో జరిగిన తప్పులు ఈసారి రిపీట్‌ అయితే తన కెరియర్‌ ప్రమాదంలో పడుతుందని గ్రహించిన అఖిల్‌ ఈ చిత్రం విషయంలో ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్‌ పెడుతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English