వరుణ్‌ తేజ్‌, సాయి పల్లవి ఫైట్‌!

వరుణ్‌ తేజ్‌, సాయి పల్లవి ఫైట్‌!

ఫిదా చిత్రంలో జంటగా నటించి బ్లాక్‌బస్టర్‌ కొట్టిన వరుణ్‌ తేజ్‌, సాయి పల్లవి ఈసారి అమీ తుమీ తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారు. వీరిద్దరి సినిమాలు ఒకే రోజున విడుదల కావడం దాదాపు ఖాయమైపోయింది. డిసెంబర్‌ 21న వరుణ్‌ తేజ్‌ అంతరిక్షం రిలీజ్‌ అవుతోంది. అదే రోజున సాయిపల్లవి, శర్వానంద్‌ కలిసి నటిస్తోన్న పడి పడి లేచె మనసు కూడా వస్తోంది. పడి పడి... చిత్రాన్ని వాయిదా వేస్తున్నారనే వార్త అప్పట్లో బాగా వినిపించింది. అయితే అప్పుడు వాయిదా వేసి జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరిలో విడుదల చేయాలని అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ సమయంలో కూడా చాలా చిత్రాలు పోటీ పడే అవకాశాలు ఎక్కువ కావడంతో ముందు అనుకున్న డేట్‌కే ఫిక్స్‌ అయ్యారు.

దీంతో వరుణ్‌ తేజ్‌, శర్వానంద్‌ చిత్రాల మధ్య పోటీ తప్పడం లేదు. వీటితో పాటు అదే రోజున వైఎస్‌ఆర్‌ పాదయాత్ర నేపథ్యంలో వస్తోన్న యాత్ర కూడా రిలీజ్‌ అవుతోంది. దీంతో ఆ వీకెండ్‌ బాక్సాఫీస్‌ వద్ద హెవీ రష్‌ ఏర్పడనుంది. మూడూ మూడు రకాల చిత్రాలు కనుక వేటి ఆడియన్స్‌ వాటికి వుంటారని అనుకోవచ్చు. అయితే అంతరిక్షం, పడి పడి లేచె మనసు చిత్రాలకి ప్రధానంగా ఏ సెంటర్స్‌, ఓవర్సీస్‌లో ఎక్కువ ఆదరణ లభించే అవకాశముంది. దీంతో వీటి మధ్య డైరెక్ట్‌ పోటీ వుండనుంది. మరి వరుణ్‌ తేజ్‌ ఇచ్చే స్పేస్‌ బ్యాక్‌బ్రాప్‌ థ్రిల్స్‌కి ఆడియన్స్‌ ఎక్కువ కనక్ట్‌ అవుతారా లేక సాయి పల్లవి ప్రేమలో మరోసారి పడి పడి లేస్తారా అనేది అప్పుడు థియేటర్లలో తేలాల్సిందే ఇక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English