బాహుబలిని కొడదామని బొక్క బోర్లా!

బాహుబలిని కొడదామని బొక్క బోర్లా!

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టయింది యష్‌ రాజ్‌ పరిస్థితి. బాహుబలి చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా లభించిన ఆదరణ చూసి జానపదాలని, కాస్టూమ్‌ డ్రామాలని జనం బాగా ఆదరిస్తున్నారని, ఆ స్కేల్‌లో సినిమా తీస్తే కోట్లు కురుస్తాయని వెంటనే 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌' లాంఛ్‌ చేసేసారు. సాధారణంగా కథ నచ్చితే కానీ ఏ సినిమా అంగీకరించని అమీర్‌ ఖాన్‌ కూడా ఈ బాహుబలి క్లోన్‌ మాయలో పడిపోయాడు. తాను కూడా బాహుబలిలా అంతా అచ్చెరువొందే సినిమా చేయాలని భావించాడు. ఈ క్రమంలో సరయిన ప్రణాళిక లేకుండా రెండు వందల యాభై కోట్ల బడ్జెట్‌తో కేవలం తారాగణాన్ని, కథా నేపథ్యాన్ని నమ్ముకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించేసారు.

ఈ చిత్రం భాగోతం ట్రెయిలర్‌లోనే బయటపడిపోయింది. దాంతో అంతవరకు సినిమాపై వున్న అంచనాలు కూడా తగ్గిపోయాయి. అనుకున్నట్టుగానే 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌' చిత్రంలో విషయం శూన్యమని రిలీజ్‌ అయిన తొలి షోకే తేలిపోయింది. ఈ చిత్రం మరో 'మొహంజుదారో' అంటూ అంతా పెదవి విరుస్తున్నారు. బాలీవుడ్‌ క్రిటిక్స్‌ అయితే అమీర్‌ చిత్రం బాలేదని చెప్పడానికి తెగ మొహమాట పడుతున్నారు. మొత్తానికి బడ్జెట్‌ వున్నంత మాత్రాన, స్టార్‌లు డేట్స్‌ ఇచ్చినంత మాత్రాన బాహుబలి లాంటివి తయారు కావని, ఆ చిత్రం వెనుక రాజమౌళి బృందం పడ్డ అయిదారేళ్ల శ్రమని కూడా చూడాలని, అంత కష్టపడితే తప్ప ఆ విజయాన్ని రిపీట్‌ చేయలేరని ఈ చిత్రంతో తేలిపోయింది. మరి ఇకనైనా బాహుబలిని కొడదామని పిల్లిమొగ్గలు వేయడం మానేస్తారా లేక ఇలాంటి సగం సగం అటెంప్టులతో బొక్క బోర్లా పడుతూనే వుంటారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English