ఫోటో: అక్క ఇప్పటికీ హాట్‌.. చెల్లెలేమో ఆంటీ!

ఫోటో: అక్క ఇప్పటికీ హాట్‌.. చెల్లెలేమో ఆంటీ!

సాధారణంగా అక్క పెళ్లి చేసుకుంటే తప్ప చెల్లెలికి పెళ్లి చేయరు. కానీ అక్క కెరియర్లో విశేషంగా రాణిస్తున్నపుడు పెళ్లితో దానికి బ్రేకులు వేయడం దేనికని చెల్లెలికి పెళ్లి చేసేసారు. ఇక్కడ చెబుతోన్నది కాజల్‌, నిషా గురించి. అక్క అడుగు జాడల్లో హీరోయిన్‌గా రాణించాలని సినీ రంగ ప్రవేశం చేసిన నిషా కొన్ని చిత్రాల్లో అయితే నటించింది కానీ కాజల్‌లా సక్సెస్‌ కాలేకపోయింది. సోలో, ఏమైందీ ఈవేళ, సుకుమారుడు చిత్రాల్లో నటించిన నిషా ఆ తర్వాత సినిమాలకి స్వస్తి చెప్పి పెళ్లి చేసేసుకుంది.

ఏడాది క్రితమే ఒక బాబుకి జన్మనిచ్చిన నిషాని కాజల్‌ దీపావళికి కలుసుకుంది. చెల్లి ఫ్యామిలీతో హ్యాపీగా టైమ్‌ స్పెండ్‌ చేసిన కాజల్‌ ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఆ ఫోటోలు చూసి నిషా కంటే నాలుగేళ్లు పెద్దదయిన కాజల్‌ ఇంకా హాట్‌గా వుంటే, నిషా ఆంటీలా అయిపోయిందనే కామెంట్లు పడుతున్నాయి. పన్నెండేళ్లుగా హీరోయిన్‌గా నటిస్తోన్న కాజల్‌ వయసు ఇప్పుడు ముప్పయ్‌ మూడేళ్లు. అయినా కానీ ఆమె కోసం తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల నుంచి నిర్మాతలు ఇంకా క్యూ కడుతూనే వున్నారు. అదేంటో ఇండస్ట్రీలో అక్కలకి దక్కినంత సక్సెస్‌ చెల్లెళ్ళకి దక్కదు... ఎక్కడో రేర్‌ కేసెస్‌లో తప్ప!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English