టాక్ ఎలా ఉన్నా వసూళ్ల మోతే..

టాక్ ఎలా ఉన్నా వసూళ్ల మోతే..

దీపావళి కానుకగా రిలీజైన ‘సర్కార్’ సినిమా దక్షిణాదిని షేక్ చేసేస్తోంది. ఈ సినిమా వసూళ్ల గురించి వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే ‘సర్కార్’ ప్రపంచవ్యాప్తంగా రూ.110 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. తొలి రోజు రూ.67 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ‘సర్కార్’.. రెండో రోజు కూడా ఊపు కొనసాగిస్తూ రూ.43 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. నిజానికి ఈ చిత్రానికి అంత మంచి టాక్ ఏమీ రాలేదు. విజయ్ అభిమానుల్ని ఈ చిత్రం మెప్పించినా.. సగటు ప్రేక్షకుల్ని నిరాశ పరిచింది. డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు రెండో రోజు వసూళ్లు పడిపోతుంటాయి. కానీ ‘సర్కార్’ విషయంలో అలా ఏమీ జరగలేదు. కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి. తమిళనాడు.. కేరళ.. కర్ణాటకల్లో ఈ చిత్రం హౌస్ ఫుల్ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ వారాంతం మొత్తానికి అక్కడ టికెట్లు దొరకడం చాలా కష్టంగా మారింది.

తెలుగులో సైతం ‘సర్కార్’ జోరు చూపిస్తోంది. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.2.3 కోట్ల షేర్ రాబట్టిన ‘సర్కార్’.. రెండో రోజు రూ.1.5 కోట్ల దాకా షేర్ రాబట్టినట్లు చెబుతున్నారు. నిన్న రిలీజైన ‘అదుగో’ను జనాలు అస్సలు పట్టించుకోలేదు. అసలే దీనికి బజ్ లేకపోగా.. టాక్ కూడా చాలా బ్యాడ్‌గా వచ్చింది. ఈ రోజు విడుదలైన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ కూడా జనాల్ని పెద్దగా ఆకర్షించలేదు. పైగా దీనికీ టాక్ బ్యాడే. ఆల్రెడీ థియేటర్లలో ఉన్న సినిమాల కథ ముగిసిపోగా.. ఇప్పుడు ‘సర్కార్’ ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ అవుతోంది. టాక్ ఎలా ఉన్నప్పటికీ జనాలు దీన్నే ప్రిఫర్ చేస్తున్నారు. అడ్వాంటేజీని పూర్తిగా వాడుకుంటూ మంచి వసూళ్లతో దూసుకెళ్తోందీ చిత్రం. ఈ ఊపు చూస్తుంటే వీకెండ్ అయ్యేసరికి రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్బులో చేరేలా ఉంది ‘సర్కార్’. విజయ్ గత సినిమాలు ‘తెరి’.. ‘మెర్శల్’లకు కూడా కొంచెం డివైడ్ టాక్ వచ్చినా తట్టుకుని భారీ వసూళ్లు సాధించాయి. ‘సర్కార్’ కూడా అదే బాటలో సాగుతోంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English