శిథిలాల నుంచి సినిమాను బయటికి తీశారు

శిథిలాల నుంచి సినిమాను బయటికి తీశారు

ఒక సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాక నెలల తరబడి కదలిక లేకుండా ఉండిపోయిందంటే దాని మీద జనాల్లో ఒక నెగెటివ్ ఫీలింగ్ పడిపోతుంది. యువ కథానాయకుడు సందీప్ కిషన్.. మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి రూపొందించిన సినిమా ఇలాగే మరుగున పడిపోయింది. ఈ సినిమా షూటింగ్ ఆరంభించినపుడు తప్పితే ఎన్నడూ వార్తల్లో లేదు. అసలు ఇలాంటి కాంబినేషన్లో సినిమా తెరకెక్కడమే ఆశ్చర్యం. స్టార్ హీరోయిన్ అయిన తమన్నా.. హీరోగా నిలదొక్కుకోవడానికి తంటాలు పడుతున్న సందీప్‌తో జత కట్టడమే చాలామందికి మింగుడు పడలేదు. పైగా ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి డైరెక్ట్ చేయడమేంటో అర్థం కావడం లేదు. ఐతే ఎవరేమనుకుంటే ఏంటి.. పోయినేడాది చడీచప్పుడు లేకుండా లండన్లో షూటింగ్ మొదలుపెట్టి సినిమా పూర్తి చేశారు.

ఐతే షూటింగ్ పూర్తయినట్లు ఒక అప్ డేట్ వచ్చాక ఈ చిత్రం వార్తల్లోనే లేదు. ఈ మధ్యలో ఇటు తమన్నా.. అటు సందీప్ వరుస ఫెయిల్యూర్లతో బాగా వెనుకబడిపోయారు. వీళ్ల కాంబినేషన్లో సినిమా అంటే ట్రేడ్ వర్గాల్లో అసలు ఆసక్తే లేకపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఆపేసి కూర్చున్నారు. అందరూ ఈ సినిమా గురించి మరిచిపోవడంతో ఇక ఇది అసలు విడుదలకే నోచుకోదని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఈ చిత్రం వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమా నుంచి రెండు ఫొటోలు రిలీజ్ చేసి.. టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఏంటి.. ఇదీ ఈ చిత్ర టైటిల్. ఈ పేరు వినగానే.. పోయినేడాది వచ్చిన అట్టర్ ఫ్లాప్ మూవీ ‘నెక్స్ట్ నువ్వే’ గుర్తుకొస్తోంది జనాలకు. ఈ వరుసలో పేరెందుకు పెట్టారో అర్థం కావడం లేదు. ఈ చిత్రంలో నవదీప్ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. అసలేమాత్రం బజ్ లేని ఈ చిత్రం ఏమాత్రం జనాల దృష్టిని ఆకర్షిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English