హృతిక్‌కు తగలాల్సింది.. ఆమిర్‌కు తగిలింది

హృతిక్‌కు తగలాల్సింది.. ఆమిర్‌కు తగిలింది

హృతిక్ రోషన్ కెరీర్లో హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువ. తొలి సినిమా ‘కహోనా ప్యార్ హై’తో తిరుగులేని సక్సెస్ అందుకున్న అతను.. మళ్లీ ఓ మోస్తరు విజయాన్నందుకోడానికి చాలా కాలమే పట్టింది. తర్వాత అతడి కెరీర్లో కోయీ మిల్ గయా.. క్రిష్.. క్రిష్-3.. ధూమ్-2 లాంటి కొన్ని హిట్లున్నప్పటికీ.. వీటిని మించిన డిజాస్టర్లు కూడా చాలానే ఉన్నాయి అతడి కెరీర్లో. చివరగా హృతిక్ నటించిన ‘మొహెంజదారో’ బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. చారిత్రక విజయం సాధిస్తుందనుకున్న ఈ సినిమా హృతిక్‌కు అవమాన భారాన్ని మిగిల్చింది. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే హృతిక్‌కు మరో హిస్టారికల్ మూవీలో చేసే అవకాశం వచ్చింది. ఆ సినిమానే ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’. యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్లో విజయ్ కృష్ణ ఆచార్య ఈ చిత్రాన్ని హృతిక్‌తోనే చేయాలనుకున్నాడు.

అప్పటికే ఈ కాంబినేషన్లో ‘ధూమ్-2’ చేసిన హృతిక్.. ఈజీగా ఈ స్టోరీకి ఓటేస్తాడని అనుకున్నారు. కానీ ‘మొహెంజదారో’తో తిన్న దెబ్బ చాలని అతను ఈ సినిమాకు నో చెప్పాడు. తర్వాత ఈ కథ ఆమిర్ ఖాన్‌ దగ్గరికి వెళ్లింది. తన స్టయిల్లో అద్భుతమైన కథాబలం ఉన్న సినిమాలతో దూసుకెళ్తున్న ఆమిర్ ఆశ్చర్యకరంగా ఈ భారీ చిత్రానికి ఓటేశాడు. ఇప్పుడు చూస్తే ఈ చిత్రం పేలవమైన టాక్ తెచ్చుకుంది. ఆమిర్ మీద ఉన్న గౌరవాన్ని ఈ చిత్రం తగ్గించింది. పైపై మెరుగులు తప్ప విషయం లేని ఈ చిత్రాన్ని ఆమిర్ ఎలా ఒప్పుకున్నాడా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇందులో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ పాత్ర అతడి స్థాయికి ఏమాత్రం తగ్గట్లుగా లేదు. ‘మంగళ్ సింగ్: ది రైజింగ్’ తర్వాత ఆమిర్ ఆ స్థాయి చేదు అనుభవాన్ని మళ్లీ ఎదుర్కోలేదు. వసూళ్ల రికార్డులు సృష్టిస్తుందనున్న సినిమా కాస్తా ఇప్పుడు డిజాస్టర్లలో రికార్డు నెలకొల్పేలా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English