సాయి పల్లవిని ఇలా చేసేసారేంది?

సాయి పల్లవిని ఇలా చేసేసారేంది?

సాయి పల్లవి అనగానే ప్రేమమ్‌లోని మలర్‌ క్యారెక్టరే ముందుగా కళ్ల ముందు మెదులుతుంది. ఆమెకి ఫిదాతో మరో కొత్త ఇమేజ్‌ తెచ్చి పెట్టాడు శేఖర్‌ కమ్ముల. ప్లెజెంట్‌ ఫేస్‌తో, పక్కింటి అమ్మాయిలా కనిపించే సాయి పల్లవికి కుర్రాళ్లలోనే కాదు పెద్దవాళ్లలోను ఫాలోయింగ్‌ ఘనంగా వుంది. అయితే తమిళ వాళ్లు సాయి పల్లవి ఇలా రెగ్యులర్‌ ఫేస్‌ కట్‌తో చూపించడానికి ఇష్టపడక తనతో కొత్త వేషం కట్టించారు.

ధనుష్‌ హీరోగా నటిస్తోన్న మారి2 చిత్రంలో సాయి పల్లవి పిచ్చ మాస్‌ క్యారెక్టర్‌ చేస్తోంది. 'అరాతు ఆనంది' అనే క్యారెక్టర్‌లో సాయి పల్లవి ఈ చిత్రంలో ఆటో డ్రైవర్‌గా కనిపించబోతోంది. సాయి పల్లవి ఈ పాత్రని తెగ ఎంజాయ్‌ చేసిందని ఆమె దీనిని చేస్తోన్న పబ్లిసిటీనే చెబుతోంది. అయితే మలర్‌ని ఇలా చూడ్డానికి కొందరు అభిమానులకి ఇబ్బందిగా వుంది.

ఈ అరవం దర్శకులకి మరో పనేమీ లేదా... ఎవరితో అయినా ఇలాంటి వేషాలు కట్టిస్తారేంటని కామెంట్‌ చేస్తున్నారు. ఒక పాత్రని అంత ఈజీగా ఓకే చేయని సాయి పల్లవి ఏరి కోరి ఈ మాస్‌ వేషం కట్టిందంటే ఖచ్చితంగా ఆనంది పాత్ర అదిరిపోయే వుండాలి. మాస్‌గా తెలుగులోకి అనువాదం అయిన మారికి సీక్వెల్‌ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా అనువాదం కావడానికి, ఘనంగా విడుదలవడానికి సాయి పల్లవి కంటే పెద్ద కారణం ఏముండాలి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English