బిగ్‌బాస్‌ గాలి బుడగే

బిగ్‌బాస్‌ గాలి బుడగే

'బిగ్‌బాస్‌' ప్రోగ్రామ్‌ ఎయిర్‌ అయినంత కాలం జనం బాగా ఇన్‌వాల్వ్‌ అయిపోవడం, ఆ తర్వాత దానిని మర్చిపోయి వేరే పనులతో బిజీ అయిపోవడం మామూలే. అందుకే బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌లు ఎవరూ ఆ తర్వాత అంతగా న్యూస్‌లో వుండరు. అయితే మొన్న ముగిసిన తెలుగు సీజన్‌ మాత్రం కాస్త భిన్నంగా అనిపించింది.

కౌశల్‌కి విపరీతమైన ఫాలోయింగ్‌ ఏర్పడడం, షో ముగిసిన తర్వాత కూడా అతను ఎక్కడికి వెళితే అక్కడ వేలాదిగా జనం గుమికూడడంతో అతను స్టార్‌ అయిపోయిన భావన కలిగింది. కానీ వేడి చల్లారిన తర్వాత నెమ్మదిగా అంతా నార్మల్‌ అయిపోయింది. కౌశల్‌కి ఇంతవరకు సాలిడ్‌ ఆఫర్స్‌ ఏమీ రాలేదు. బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో పార్టిసిపేట్‌ చేసిన ఎవరి జీవితాలు ఉన్నపళంగా మారిపోలేదు.

గతంలో కంటే వారికి గుర్తింపు పెరగడం, ఎక్కడయినా కనిపిస్తే ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు తీసుకునే వారు ఎక్కువ వుండడం మినహాయిస్తే వారికి కొత్తగా వచ్చిందేమీ కనిపించడం లేదు. దీంతో మరోసారి బిగ్‌బాస్‌ గాలి బుడగేనని, అది సీజన్‌ నడిచినంత కాలమే జనం మదిలో వుంటుందని, ఆ తర్వాత వారిని నెమ్మదిగా అందరూ మర్చిపోతారని రుజువైంది.

ఈ సీజన్‌ చూసిన తర్వాత ఎక్కువ మంది సెలబ్రిటీలు వచ్చే షోలో పాల్పంచుకుంటారని అనుకున్నారు కానీ సీజన్‌ ముగిసిన తర్వాతి సీన్‌ చూసాక దీనిపై పాపులర్‌ సెలబ్రిటీలు దృష్టి పెట్టే అవకాశాలయితే తక్కువే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English