విజయ్ రేంజేంటి.. ఈ ఇమిటేషన్లేంటి?

విజయ్ రేంజేంటి.. ఈ ఇమిటేషన్లేంటి?

దక్షిణాదిన సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే విజయ్ పేరే చెప్పాలి. తుపాకి.. కత్తి.. మెర్శల్ లాంటి బ్లాక్ బస్టర్లతో గత కొన్నేళ్లలో తన స్థాయిని ఎంతో పెంచుకున్నాడు విజయ్. తెలుగులో ఒకప్పుడు జీరోగా ఉన్న అతను.. ఇప్పుడు ఓ మోస్తరుగా మార్కెట్ సంపాదించుకున్నాడు. ‘సర్కార్’తో మిగతా తమిళ హీరోలకు దీటుగా తెలుగులో వసూళ్లు రాబట్టాడు. ఇక కేరళ, కర్ణాటకల్లో విజయ్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

డైరెక్ట్ సినిమాల స్థాయిలో అక్కడ అతడి చిత్రాలకూ ఓపెనింగ్స్ వస్తుంటాయి. తమిళనాడులో అయితే రజనీకి ఏమాత్రం తగ్గని స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్నాడతను. గత కొన్నేళ్లలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. ‘సర్కార్’కు ఏకంగా రూ.170 కోట్ల దాకా బిజినెస్ జరిగిందంటే విజయ్ ఏ రేంజికి చేరుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.

మరి ఈ స్థాయిలో ఉన్న హీరో.. వేరే హీరోల్ని ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది? ‘సర్కార్’లో అదే చేశాడతను. రజనీకాంత్.. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లను విజయ్ ఇమిటేట్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఒక ఫైట్లో రజనీ స్టయిల్లో విజయ్ స్టైల్‌గా చూయింగ్ గమ్ నోట్లో వేసుకోవడం గమనించవచ్చు. మరో సీన్లో పవన్ స్టయిల్లో ‘హ హ హ..’ అంటూ డైలాగ్ చెబుతూ మేనరిజం చూపించాడు కూడా.

ఇది కేవలం తెలుగు జనాల కోసం చేసిందేమీ కాదు. తమిళంలోనూ అదే స్టయిల్ చూపించాడు. నిజానికి విజయ్.. పవన్‌ను మించిన రేంజిలో ఉన్నాడు. రజనీకి కూడా దగ్గరగా ఉన్నాడు. చిన్న స్థాయి హీరోలు రజనీ, పవన్‌లను ఇమిటేట్ చేస్తే ఆశ్చర్యమేమీ లేదు. అటు తమిళంలో, ఇటు తెలుగులో చాలామంది వారిని అనుకరిస్తుంటారు. కానీ విజయ్ స్థాయి హీరో వీళ్లను ఇమిటేట్ చేయడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English