ఆమిర్‌ర్‌కు ఆ దమ్ముందా?

 ఆమిర్‌ర్‌కు ఆ దమ్ముందా?

ఇండియాలో చాన్నాళ్ల తర్వాత మొత్తం దేశం దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా వస్తోంది. అదే.. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. గత ఏడాది వేసవిలో  ‘బాహుబలి: ది కంక్లూజన్’ వచ్చాక ఆ స్థాయిలో హైప్ తెచ్చుకున్న సినిమా మరొకటి లేదు. ‘బాహుబలి-2’ వసూళ్ల రికార్డును బద్దలు కొట్టడం గురించి అసలు ఆలోచన కూడా రాలేదు. ఐతే ఇండియాలో మరే హీరోకూ లేని క్రెడిబిలిటీ.. మార్కెట్ ఆమిర్ ఖాన్‌ సొంతం.

గత రెండు దశాబ్దాల్లో ఇంతింతై అని ఎదుగుతూ ఎవ్వరూ అందుకోలేని శిఖర స్థాయికి చేరుకున్నాడు ఆమిర్. ముఖ్యంగా ‘దంగల్’తో అతను వరల్డ్ స్టార్ అయిపోయాడు. చైనా వసూళ్లను కూడా కలిపితే ఈ చిత్రం రూ.2 వేల కోట్ల గ్రాస్ మార్కును అందుకోవడం విశేషం. ఇప్పుడు ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’కు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. అన్ని రికార్డులూ బద్దలైపోవడం ఖాయం.

ప్రస్తుతం ఓవరాల్ వసూళ్లలో ‘దంగల్’దే పైచేయి అయినప్పటికీ.. చైనాలో అనుకోకుండా వచ్చిన కలెక్షన్లను కలిపి చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇండియాలో ‘బాహుబలి-2’ వసూళ్లు భారీగా.. ఎవ్వరూ అందుకోని స్థాయిలో ఉన్నాయి. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’తో వాటిని దాటగల సత్తా ఆమిర్ ఖాన్‌కు ఉందని అభిమానులు అంటున్నారు. ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. కావాల్సిందల్లా పాజిటివ్ టాకే. అది వచ్చిందంటే పాత రికార్డులన్నీ చెరిగిపోవడం ఖాయం.

‘బాహుబలి-2’ ఇండియన్ వసూళ్లతో పాటు ఓవరాల్ కలెక్షన్లలోనూ ఇది దాటేసే అవకాశముంది. ఐతే తన గత సినిమాల విషయంలో ఉన్నంత కాన్ఫిడెన్స్ ఈ చిత్రం విషయంలో ఆమిర్‌లో కనిపించడం లేదు. ట్రైలర్‌కు డివైడ్ టాక్ వచ్చిన నేపథ్యంలో సినిమాకు జనాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English