దీపావళి పటాసులన్నీ.. జస్ట్ తుస్సే

దీపావళి పటాసులన్నీ.. జస్ట్ తుస్సే

సాధారణంగా మన దగ్గర దీపావళికి సినిమాల హడావుడి కాస్త తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే దీపావళి అమావస్య రోజున వస్తుంది కాబట్టి మనోళ్ళు సినిమాలను రిలీజ్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపరు. కాని తమిళంలో మాత్రం ఈ పండుగను చాలా స్పెషల్ గా తీసుకుంటారు. పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. ఆ ప్రభావంతో ఇప్పుడు మన బాక్సాఫీస్ కూడా దీపావళికి తెలుగు సినిమాల తోరణాలను కట్టిచుకుంటోంది.

ఇంతకీ మన మన సినిమాల సందడి అంతా ఈసారి తడిచిపోయిన టపాకాయల వలే తస్సుమంది. ఆల్రెడీ దసరాకు రిలీజ్ అయిన అరవింద సమేత.. బండి లాగడానికి కష్టపడి ఇప్పటికే చాలా ధియేటర్లను ఖాళీ చేసేసింది. అలాగే సవ్యసాచి కూడా ముందే చీదేసిన జువ్వాయిలా తుస్సుమంది. ఇక అదుగో సినిమా పరిస్థితి సగం కాలిన చిచ్చుబుడ్డిలా ఉందని అంటున్నారు ట్రేడ్ జనాలు. తమిళ డబ్బింగ్ సినిమా సర్కార్ కూడా సరిగ్గా ఎండని మతాబులా అక్కడక్కడ మెరవడమే కాని.. మొత్తంగా వెలుగులు నింపలేకపోయింది. ఇంకొన్ని చిన్న చిన్న సినిమాలు కూడా.. కనీసం వెన్నముద్దల్లా కూడా వెలుగలేదు.

దీపావలి నాట తెలుగోళ్లు పేల్చే టపాసులే వెలుగులు నింపాలికాని.. ఈసారి బాక్సాఫీస్ మాత్రం ఎటువంటి వెలుగును ప్రసరించేలా కనిపించట్లేదు. ప్రొడ్యూసర్లకు కాసులు కురుస్తాయనీ అనిపించట్లేదు. మరి ఈ సంవత్సరానికి ఇంకా మిగిలింది క్రిస్మస్ పండగ ఒకటే. అప్పుడైనా మనోళ్ళు కాస్త గట్టిగా కొడతారేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English