ఫ్లాపుల్లో ఉన్నోళ్ళందరూ వాటి మీదే పడ్డారు

ఫ్లాపుల్లో ఉన్నోళ్ళందరూ వాటి మీదే పడ్డారు

మరి వరుసగా ఫ్లాపులు వస్తుంటే ఏం చేయాలి? సొంతంగా దర్శకులు రెడీ చేసిన కథలు వర్కవుట్ కాకపోతే ఎలా ప్రొసీడ్ అవ్వాలి? ఇప్పుడు ఫ్లాపు సినిమాలతో సతమతమవుతున్న హీరోలందరినీ ఇదే ప్రశ్న వేధిస్తోంది. అందుకే వారందరూ ఒకే రూటును ఎంచుకుంటున్నారు. అదేంటో చూద్దాం పదండి.

తన సినిమాలు ఏవన్నా వరుసగా రెండు వర్కవుట్ కాకపోతే.. వెంటనే ఏదో ఒక మలయాళం సినిమానో తమిళ సినిమానో రీమేక్ చేశేవాడు విక్టరీ వెంకటేష్. ఇప్పుడు యంగ్ హీరోలు కూడా బహుశా ఆయన్ను ఇనిస్పిరేషన్ గా తీసుకున్నట్లు ఉన్నారు. సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో ఈ మధ్యన ఎక్కడా పెద్దగా కనిపించని సందీప్ కిషన్ ఇప్పుడు ఒక తమిళ హిట్టును తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. వరుసగా ఫ్లాపులు రావడంతో.. ఆల్రెడీ ప్రేమమ్ రీమేక్ చేసిన నాగ చైతన్య.. మరో రీమేక్ కోసం పావులు కదుపుతున్నాడట. శర్వానంద్ కూడా జిగర్ తాండా రీమేక్ చేయడానికి సన్నద్దంగానే ఉన్నాడు.

ఇక సీనియర్ హీరో రవితేజ కూడా అమర్ అక్బర్ యాంటోని వర్కవుట్ కాకపోతే.. రెండు తమిళ సినిమాల రీమేక్ లు చేసే యోచనలో పడ్డాడని టాక్. మరో సీనియర్ స్టార్ నాగార్జున కూడా ఆల్రెడీ విక్రమ్ వేదా సినిమాను తీయాలని అనుకుంటున్నారు. ఇక తమిళ హిట్ 96, ఈ మధ్యన హిందీలో బ్లాక్ బస్టర్లు అయిన స్త్రీ వంటి సినిమాలను కూడా తెలుగులో తీస్తున్నారు. వీటిల్లో కాస్త ఇబ్బందుల్లో ఉన్న పెద్ద హీరోలే నటించే ఛాన్సుంది.

ఈ ప్లాన్స్ అన్నీ బాగానే ఉన్నాయి కాని.. మరి ఆల్రెడీ హిట్టయిన సినిమాలను మన నేటివిటీలోకి మార్చి.. ఒరిజినల్ సినిమాలో ఉన్న సోల్ మిస్సవ్వకుండా తీయాలంటే కూడా పెద్ద యజ్ఞమే. రీమేకుల సక్సెస్ రేట్ కూడా 50ః50 అనే చెప్పాలి. కాబట్టి తీసేది స్ట్రయిట్ సినిమా అయినా రీమేక్ అయినా.. జాగ్రత్తగానే తీయాలి సుమీ!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English