అఖిల్.. ఎప్పుడూ అవే ఫోజుల్!!

అఖిల్.. ఎప్పుడూ అవే ఫోజుల్!!

మిష్టర్ మజ్ఞూ అంటూ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు అక్కినేని అఖిల్. తన తొలి రెండు సినిమాలు కనీసం మినిమం గ్యారంటీగా కూడా ఆడకపోవడంతో.. చాలా డిజప్పాయింట్ అయిన ఈ చిన్నోడు.. ఇప్పుడు యూత్ ఫుల్ లవ్ స్టోరీతో సేఫ్‌ గేమ్ ఆడుతున్నట్లు ఈ మజ్ఞూ వారి టీజర్ చూస్తేనే తెలుస్తోంది. కాని అక్కడే ఓ చిక్కుంది.

రొటీన్ కథను కూడా కొత్త ప్యాకేజింగ్ లో అందిస్తేనే అందులో ఏదో విషయం ఉందని నమ్ముతున్నారు సినిమా లవ్వర్స్. అందుకే పోస్టర్ డిజైన్ల కోసం ప్రత్యేక క్రియేటివ్ టీములను రంగంలోకి దింపి.. ఏదో కొత్తగా ఉండేలా చూసుకుంటున్నారు బడా హీరోలు, డైరక్టర్లు. కాని అఖిల్ విషయంలో.. 'అఖిల్', 'హలో', 'మిష్టర్ మజ్ఞూ'.. ఈ మూడు సినిమాల పోస్టర్లను దగ్గరకు తీసుకుని చూస్తే.. మూడింటిలో మనోడు ఫోజులు ఒకేలా ఉన్నాయి. ఇవాళ రిలీజైన మజ్ఞూ దీపావళి పోస్టర్ కూడా అందుకు మినహాయింపు కాదు. కేవలం పోస్టర్ మీద తను కనబడటం తప్పిస్తే.. వాటిలో పెద్దగా క్రియేటివ్ ఎలిమెంట్ అంటూ ఏదీ కనిపించట్లేదు. ఒక యంగ్ హీరో ఇలాంటి రొటీన్ పోస్టర్లతో అలరించేస్తానంటే ఎలా??

'తొలిప్రేమ' సినిమాతో వెలుగులోకి వచ్చిన కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి డైరక్షన్లో ఈ మజ్ఞూ చెక్కబడుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తవ్వగా.. నాగార్జున సినిమా చూసి కొన్ని మార్పులు సూచించారని టాక్. చిన్న చిన్న ఎడ్జస్టమెంట్లు అన్నీ అయిపోయాక 2019 జనవరిలో సినిమాను రిలీజ్ చేస్తారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English