సెక్సీ ఆలియా.. వాళ్లకు ఓకేయా?

సెక్సీ ఆలియా.. వాళ్లకు ఓకేయా?

ఈ రణబీర్ కపూర్ ఉన్నాడు చూడండి.. మంచి అందగాడు మంచి నటుడు కూడా. అలాగే మంచి ప్రేమికుడు అని చెబుతుంటుంది బాలీవుడ్. కొన్నాళ్ళు సోనమ్ కపూర్ ను ప్రేమించాడు. తరువాత దీపికా పదుకొనె అనేశాడు. పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే.. బ్రేకప్ చెప్పి.. కత్రినా కైఫ్‌ తో సాంగేసుకున్నాడు. ఆ తరువాత ఆమెతో కూడా బ్రేకప్పే. మధ్యలో పాకిస్తాన్ నటీమణి మహీరా ఖాన్ తో సన్నిహితంగా ఉన్నాడు. ఇప్పుడు ఆలియా భట్ అంటూ స్టెప్పులు వేస్తున్నాడు. అందుకే ఇప్పుడో సందేహం వచ్చింది.

అసలు రణబీర్ ఏ అమ్మాయిని తెచ్చినా కూడా.. ఓకే చేసేది మాత్రం తల్లిదండ్రులు రిషి కపూర్ మరియు నీతు సింగ్ అని స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. అయితే మనం ఏ హీరోయిన్ ను తీసుకున్నా కూడా.. మ్యాగ్జిం మ్యాగజైన్లో సెక్సీగా ఫోజులిచ్చాక దీపిక మనోడితో కటిఫ్ చేసుకుంది. బార్ బార్ దేఖో సినిమాలో బికినీలో మెరిశాక.. కత్రినా బ్రేకప్ అయ్యింది. ఇదంతా చూస్తుంటే.. కాబోయే కోడలు ఎక్సపోజింగ్ చేస్తే చాలు.. ఆమె తల్లిదండ్రులే కట్ చేస్తున్నారేమో అనే డౌట్ ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు ఆలియా భట్ కూడా.. ప్రేమ వ్యవహారం స్టార్ట్ చేసి జస్ట్ సంవత్సరమే అయినా కూడా.. తన హాట్నెస్ మాత్రం ఎక్కడా తగ్గించట్లేదు.

మొన్న షారూఖ్ ఖాన్ దివాళి పార్టీలో ఎంతో హాటుగా దర్శనం ఇచ్చిన ఆలియా.. ఇప్పుడు వోగ్ మ్యాగజైన్ ఫోటోషూట్లో కూడా క్లీవేజ్ షో లతో రెచ్చిపోయింది. ఇతరత్రా ఫ్యాషన్ ఈవెంట్లలో కూడా ఎక్కడా తగ్గట్లేదు. అదంతా చూస్తుంటే.. మరి సెక్సీగా ఉండే ఆలియా వాళ్ళకు ఓకేయా అనే సందేహం రాకపోలేదు. ఆ విషయం తెలియాలంటే.. వీళ్ళ ప్రేమ ఎంతవరకు వెళుతుందో చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English