మెహ్రీన్ కు మళ్ళీ దెబ్బ పడిపోతుందా?

మెహ్రీన్ కు మళ్ళీ దెబ్బ పడిపోతుందా?

అసలు ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా చేతిలో లేకుండానే.. అరడజను సినిమాలు చేయడమంటే.. చాలా టాలెంట్ ఉన్నట్లే అనుకోవాలి. తాప్సీ తరహాలో గ్లామర్ ఆరబోసినా డజను సినిమాల్లో మెరవొచ్చు.. లేదంటే రాశి ఖన్నా తరహాలో కాస్త యాక్టింగ్ పండించినా.. ఫ్లాపులతో పనిలేకుండా సినిమాలొస్తాయ్. కాని రెండింటిలో నిల్ అయిన మెహ్రీన్ కు మాత్రం.. లక్కే లక్కు అన్నట్లు ఛాన్సులు వచ్చేశాయి.

కాకపోతే తన వైపు వచ్చిన ఆఫర్లన్నీ చేతబట్టుకుని.. కొన్నిసార్లు తప్పులో కాలేసింది మెహ్రీన్. అదిగో మొన్న విజయ్ దేవరకొండతో 'నోటా' సినిమా చేస్తున్నందుకు తెగ సంబరపడింది. అయితే ఆ సినిమాలో ఆమెది ఉత్తుత్తి రోల్ అని చూసినోళ్లందరూ అనడంతో.. బాగా హర్టయ్యిందట. దానికంటే ముందు పంతం సినిమాలో.. అంతకంటే ముందుగా జవాన్ సినిమాలో కూడా ఇదే పరిస్థితి. పేరుకే హీరోయిన్ కాని.. అసలు రోల్ మాత్రం లేనేలేదు. ఇలా కనిపించి అలా మాయమైపోయే పాత్రలో.. కనీసం యాక్టింగ్ కూడా సరిగ్గా చేయకపోవడంతో.. పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇప్పుడు తదుపరి F2 సినిమాతో రానుంది.

నిజానికి ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే.. పక్కనే తమన్నా అంత గ్లామరస్ గా బాగా స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న తారగా మెరుస్తుంటే.. మెహ్రీన్ మాత్రం బాగా తేలిపోయింది అంటున్నారు సినిమా లవ్వర్స్. పైగా తమన్నా అసలే ఓవరాక్షన్ తో మాస్ జనాలను తెగ ఊరిస్తుంది. మరి ఆమె పక్కన మెహ్రీన్ అసలు కనబడుతుందా? లేదంటే కేవలం వరుణ్‌ తేజ్ పక్కన పాటల్లో మెరిసి వెళిపోతుందా? అందుకే ఆమెకు మరోసారి దెబ్బ పడుతుందేమోనని ఆమె అభిమానులకు కంగారుగా ఉందట.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English