తెలుగోళ్ళ కోసం కాస్త తగ్గుతుందట

తెలుగోళ్ళ కోసం కాస్త తగ్గుతుందట

ఇప్పుడున్న హీరోయిన్లు అందరూ టాప్ పొజిషన్ కు వెళ్ళడానికి తెగ కష్టపడుతుంటే.. అప్పట్లో కొంతమంది తొలి సినిమాతోనే అలజడి సృష్టించి.. ఒక్కసారిగా టాప్ స్థానానికి ఎగబాకేశారు. అలాంటి సుందరీమణుల్లో.. తన నడుం సోయగాలతో తెలుగు ప్రేక్షకులకు మతులుపోగొట్టేసిన 'దేవదాస్' పిల్ల ఇలియానా డిక్రూజ్ బాగానే గుర్తుంటుందిలే.

మ్యాటర్ ఏంటంటే.. 2012లో జులాయ్ వంటి సినిమాల్లో మెరిసిన ఇలియానా.. అప్పటికే చాలా ఫ్లాపుల్లో తళుక్కుమనడం.. ఆమెకు బాలీవుడ్ లో ఆఫర్లు రావడం.. వగైరా కారణాలతో తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. ఆ తరువాత తెలుగు సినిమాల్లో ఏముంది.. అక్కడ కేవలం నా నడుం చూపించడానికే ఎగబడతారు అంటూ కామెంట్లు కూడా చేసింది. అందుకే అప్పట్లో ఆఫర్లు ఇద్దాం అనుకున్న దర్శకులు హీరోలు కూడా సైడ్ అయిపోయారు. అయితే బాలీవుడ్లో బాగా దెబ్బలు తిన్న సమయంలో.. ఇక పనేం లేక.. అసలు జిమ్ కు కూడా వెళ్ళకుండా కాస్త బొద్దెక్కిన తరుణంలో.. పిలిచి ఛాన్సిచ్చాడు మాస్ రాజా రవితేజ. ఆ విధంగా అమ్మడు అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో హీరోయిన్ అయిపోయింది.

అయితే ఇప్పుడు ఆ సినిమా ప్రమోషన్లకు రావాలి కాబట్టి.. గత వారం రోజుల నుండి బీభత్సంగా లిక్విడ్ డైట్ చేస్తూ.. వెయిట్ తగ్గే పనిలో ఉందట. బహుశా సినిమా రిలీజై మరో సినిమా అవకాశం రావాలి కాబట్టి.. కాస్త సీరియస్ గా వెయిట్ తగ్గుదామని డిసైడైందట ఇల్లీ. ఎందుకంటే అసలు తెలుగులో ఆమె నడుముకే ఎక్కువమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ విషయం గుర్తొచ్చి ఎవరైనా హర్టయితే.. ఆమెకు మరిన్ని ఛాన్సులు ఎలా వస్తాయి. అందుకే మునపటి ఫిగర్ దిగొచ్చేలా కాస్త చెమటోడుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English