ఆమిర్ ఖాన్.. శ్రీదేవి కళ్లలోకి చూడలేక

 ఆమిర్ ఖాన్.. శ్రీదేవి కళ్లలోకి చూడలేక

ఇండియన్ సినిమాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరినీ ఆకట్టుకున్న కథానాయిక ఎవరైనా ఉన్నారంటే అది శ్రీదేవే. దక్షిణాది.. ఉత్తరాది అని తేడా లేకుండా ఇక్కడా అక్కడా అన్ని వర్గాల ప్రేక్షకులనూ తన అందంతో, అభినయంతో ఆకట్టుకుంది శ్రీదేవి. కేవలం సామాన్య ప్రేక్షకులే కాదు.. ఫిలిం సెలబ్రెటీలు కూడా శ్రీదేవి అందానికి బానిసలే.

రామ్ గోపాల్ వర్మ సహా చాలామంది శ్రీదేవి అంటే పిచ్చెక్కి పోతుంటారు. ఈ జాబితాలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కూడా ఉన్నాడట. శ్రీదేవి అంటే తనకు పిచ్చి అభిమానం అంటున్నాడు ఆమిర్ ఖాన్. ఒక టీవీ షోలో అతనీ విషయాన్ని వెల్లడించాడు. శ్రీదేవి మీద తన అభిమానాన్ని దాచుకోలేకపోయేవాడినని.. ఆమె కళ్లల్లోకి చూస్తే ఎక్కడ తన ఫీలింగ్స్ బయటపడిపోతాయో అని ఒక మ్యాగజైన్ షూట్ సందర్భంగా చాలా ఇబ్బంది పడ్డానని ఆమిర్ చెప్పాడు.

ఆ ఫొటోషూట్లో భాగంగా ఆమిర్‌.. శ్రీదేవి కళ్లల్లోకి చూస్తూ పోజు ఇవ్వాల్సి వచ్చిందట. కానీ అందుకు ఆమిర్ ఒప్పుకోలేదట. అలా చూస్తే శ్రీదేవి అంటే తనకు ఎంత ఇష్టం ఉందో ఆమెకు తెలిసిపోతుందని చెప్పి.. అలా చేయడానికి నిరాకరించాడట. చాలా ఇబ్బంది పడుతూనే ఆ ఫొటో షూట్ చేశానన్న ఆమిర్.. శ్రీదేవితో ఒక సినిమా చేయాలని తనకు ఎంతో ఆశగా ఉండేదని.. ఆ దిశగా ప్రయత్నం కూడా చేశానని చెప్పాడు. దర్శక నిర్మాత మహేశ్‌ భట్‌ దగ్గరికెళ్లి ‘రోమన్‌ హాలిడే’ అనే హాలీవుడ్‌ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయమని.. అందులో తాను, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటిస్తామని కూడా ఆమిర్ అడిగాడట. ఇందుకు మహేశ్‌ భట్‌ కూడా ఒప్పుకొన్నాడట.

కానీ కొన్ని కారణాల వల్ల శ్రీదేవిని ఈ చిత్రంలో నటింపజేయలేకపోయారట. చివరికి తన కూతురు పూజా భట్‌నే కథానాయికగా పెట్టి ఆమిర్‌తో ‘దిల్‌ హై కీ మాన్‌తా నహీ’ పేరుతో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారట. అలా శ్రీదేవితో నటించే అవకాశం త్రుటిలో చేజారిందని.. అందుకు చాలా బాధ పడుతున్నానని ఆమిర్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English