సెన్సార్ మాజీ బాస్.. తాను తవ్విన గోతిలోనే

 సెన్సార్ మాజీ బాస్.. తాను తవ్విన గోతిలోనే

పహ్లాజ్ నిహ్లాని.. సినీ జనాలు అంత సులువుగా మరిచిపోలేని పేరు. సెన్సార్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న మూణ్నాలుగేళ్లు అతను చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు నిర్మాతగా అతను తీసినవి బి-గ్రేడ్ సినిమాలు. కానీ సెన్సార్ బోర్డు ఛైర్మన్ అవ్వగానే శుద్ధ పూస అయిపోయాడు.

కత్తి పట్టుకుని సినిమాలకు కోత వేయడానికి రెడీ అయిపోయాడు. అతడి హయాంలో చాలా సినిమాలు సెన్సార్ సమస్యలు ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ‘ఉడ్తా పంజాబ్’ లాంటి సినిమాలకు ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయో? అప్పట్లో పహ్లాజ్ తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది.

ఐతే సెన్సార్ బోర్డు ఛైర్మన్ పదవి నుంచి దిగీ దిగంగానే ‘జూలీ-2’ లాంటి బూతు సినిమాను నిర్మించి తన అభిరుచి ఏంటో చూపించాడు పహ్లాజ్. ఆ సినిమాకు కొంత మేర సెన్సార్ సమస్యలు ఎదురయ్యాయి.

అది ఎలాగోలా సమస్యల నుంచి బయటపడి విడుదలకు నోచుకుంది. ఇప్పుడు పహ్లాజ్ స్వీయ దర్శకత్వంలో ‘రంగీలా రాజా’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు చుక్కలు చూపిస్తోంది. దీనికి సెన్సార్‌ బోర్డు 20 కట్స్‌ సూచించింది. దీంతో ఆగ్రహించిన పహ్లాజ్ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. సెన్సార్‌ బోర్డు చీఫ్‌ ప్రసూన్‌ జోషిపై పిటిషన్‌ వేశాడు. పాత విషయాలను మనసులో పెట్టుకుని ప్రసూన్‌ ఇలా చేస్తున్నారని నిహ్లానీ పిటిషన్‌లో పేర్కొన్నాడు.

"వ్యక్తిగతంగా నాపై కక్ష సాధిస్తున్నారు.  నా సినిమాను సెన్సార్‌ బోర్డుకు పంపితే ఈ రకంగా నాపై కక్ష సాధిస్తున్నారు. కానీ నేను పోరాడకుండా వెనక్కి తగ్గేది లేదు. ప్రస్తుత సీబీఎఫ్‌సీ చీఫ్ ప్రసూన్‌ జోషికి ఆమిర్‌ ఖాన్‌తో ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. కాబట్టి ఆయన ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ చిత్రానికి క్లియర్‌ సర్టిఫికేట్‌ ఇచ్చారు. కానీ నేను తెరకెక్కించిన ‘రంగీలా రాజా’ చిత్రాన్ని సరైన సమయానికి సెన్సార్‌కు పంపితే 20 కట్స్‌ విధించారు. ఆ  సన్నివేశాలను తొలగించడానికి ఒప్పుకోను" అన్నాడు నిహ్లాని.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English