పవన్‌, మహేష్‌ కంటే ఇతనే పుడింగు!

పవన్‌, మహేష్‌ కంటే ఇతనే పుడింగు!

సౌత్‌ ఇండియాలో అతి పెద్ద సూపర్‌స్టార్‌ ఎవరనే దానికి ఖచ్చితమైన సమాధానం రజనీకాంత్‌. మరి అతని తర్వాత అత్యధిక మార్కెట్‌ వున్న సౌత్‌ స్టార్‌ కౌన్‌? మన పవన్‌కళ్యాణో, మహేష్‌బాబో అయి వుంటారనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆ రెండో స్థానం కూడా ఓ తమిళ నటుడిదే. అతను మరెవరో కాదు... విజయ్‌. తెలుగునాట అంతగా మార్కెట్‌ లేకపోయినా కానీ మిగిలిన ప్రాంతాల్లో విజయ్‌ సినిమాలకి వుండే గిరాకీ అలా ఇలా వుండదు. అసలే వరుస విజయాలతో దూసుకుపోతున్నాడో ఏమో అతని తాజా చిత్రం 'సర్కార్‌' ధర నూట అరవై కోట్లు పైగానే పలికింది. ఇందులో హిందీ శాటిలైట్‌ రైట్స్‌ కూడా ఇన్‌క్లూడ్‌ అయ్యాయనుకోండి.

రజనీకాంత్‌ సినిమాలు పక్కన పెడితే అత్యధిక మొత్తానికి అమ్ముడు పోయిన సినిమా ఇదేనట. రేపు రిలీజ్‌ అవుతోన్న సర్కార్‌ టికెట్లు తమిళనాడులో అస్సలు దొరకడం లేదు. పెట్టినవి పెట్టినట్టు మాయమైపోతూ వుండడంతో టికెట్ల కోసం అభిమానులు అల్లాడిపోతున్నారు. టాక్‌తో సంబంధం లేకుండా ఈ వారాంతం వరకు ఈ ఉధృతి కొనసాగుతుందని భావిస్తున్నారు. విచిత్రంగా ఈ చిత్రానికి తెలుగునాట కూడా మంచి డిమాండ్‌ ఏర్పడింది. మంగళవారం నాడు రిలీజ్‌ అవుతున్నా కానీ సర్కార్‌ టికెట్లు బాగా సేల్‌ అవుతున్నాయి. విజయ్‌ కనుక ఈ సినిమాతో ఇక్కడా మార్కెట్‌ పెంచుకుంటే మిగతా సూపర్‌స్టార్స్‌కి ఇప్పట్లో ఇతడిని అందుకోవడం చాలా కష్టమవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English