శంకర్.. రాజమౌళి మాయలో పడ్డాడా?

శంకర్.. రాజమౌళి మాయలో పడ్డాడా?

మొన్నటి ‘2.0’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రాజమౌళిని శంకర్ తెగ పొగిడేసి ఉండొచ్చు. అతడికి తాను అభిమానినని అని ఉండొచ్చు. కానీ రాజమౌళి విషయంలో శంకర్ అంత పాజిటివ్ ఫీలింగ్‌తో ఉంటాడని ఎవ్వరూ అనుకోవడం లేదు. తన ముందు చాలా చిన్న స్థాయి దర్శకుడిలా ఉన్న రాజమౌళి.. ఇంతింతై అన్నట్లు ఎదిగిపోవడం.. తనను మించి పాపులారిటీ సంపాదించడం.. అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ సినిమాకు టార్చ్ బేరర్ లాగా మారడం.. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఆదరణ తెచ్చుకోవడం.. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో తనను మించిపోవడం.. ఇవన్నీ శంకర్‌కు అంత రుచించే విషయాలు కావు. సాంకేతికంగా ఇండియన్ సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడిగా ఇంతకుముందు శంకర్ పేరే చెప్పుకునేవాళ్లు. కానీ ‘మగధీర’.. ‘ఈగ’.. ‘బాహుబలి’ లాంటి సినిమాలతో రాజమౌళి.. శంకర్‌ను మించి ఎక్కడికో వెళ్లిపోయాడు.

ఈ నేపథ్యంలో శంకర్ ఇగోకు పోయాడో ఏమో తెలియదు కానీ.. ‘2.0’లో విజువల్ ఎఫెక్ట్స్.. యాక్షన్ ఘట్టాల్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని.. హాలీవుడ్ స్థాయిలో సినిమాను నిలబెట్టాలని.. సాంకేతికంగా ‘బాహుబలి’ని మించిన సినిమా ‘2.0’ అనిపించుకోవాలని పట్టుదల పట్టినట్లు కనిపిస్తోంది. ఇటీవల రిలీజైన ట్రైలర్ చూస్తే ఇదే ఫీలింగ్ కలుగుతోంది జనాలకు. ఐతే టెక్నికల్‌గా రాజమౌళిని అధిగమించాలనే ప్రయత్నంలో శంకర్ దారి తప్పాడేమో అన్నది ఇప్పుడు డౌట్.

ఎందుకంటే ‘రోబో’లో మాదిరి ఇందులో ఎంటర్టైన్మెంట్.. రొమాన్స్.. సెంటిమెంట్ ఏమీ ఉన్నట్లుగా లేవు. సినిమా అంతా యాక్షన్ ఘట్టాలు తప్ప ఇంకేమీ లేనట్లున్నాయి. ‘రోబో’ సినిమా అన్ని వర్గాలకూ అంతగా నచ్చిందంటే అందులో అన్ని రకాల అంశాలూ ఉన్నాయి. అందులో యాక్షన్ ఘట్టాలకంటే వినోదాత్మక సినిమాలు అమితంగా ఆకట్టుకున్నాయి. కొన్ని హృద్యమైన.. మనసుకు హత్తుకునే సన్నివేశాలున్నాయి.

అలాంటివి ‘2.0’లో ఉన్నట్లు కనిపించలేదు ట్రైలర్ చూస్తే. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్ అందుకోవాలని.. కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్‌తో మెస్మరైజ్ చేయాలని శంకర్ తపించి.. మిగతా అంశాల్ని విస్మరించాడేమో.. ఇది ‘2.0’ ఫలితం మీద ప్రభావం చూపుతుందేమో అని సందేహాలు నెలకొన్నాయి. మరి ఈ నెల 29న ఏం జరుగుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English