త్రివిక్రమ్‌ నుంచి త్రినాధరావుకి!

త్రివిక్రమ్‌ నుంచి త్రినాధరావుకి!

ఒకప్పుడు వెంకటేష్‌తో సినిమా చేయడానికి అగ్ర దర్శకులంతా క్యూలో వుండేవారు. కానీ ఇప్పుడు సీనియర్‌ అయిపోయాడు కనుక, మునుపటిలా టాప్‌ 4లో లేడు కనుక వెంకటేష్‌కి సోలోగా నటించడానికి ద్వితీయ శ్రేణి దర్శకులే దొరుకుతున్నారు. తేజ చిత్రం ఆగిపోవడంతో త్రివిక్రమ్‌తో చేద్దామనుకున్న సినిమా అయినా త్వరగా మొదలవుతుందని వెంకీ చూసాడు.

కానీ త్రివిక్రమ్‌ మాత్రం వెంకీకి మూడింతలు మార్కెట్‌ వున్న అల్లు అర్జున్‌ రెడీగా వుండడంతో అటు వెళ్లిపోయాడు. సోలో హీరోగా నటించి చాలా కాలం అవుతుండడంతో, అన్నీ మల్టీస్టారర్లే చేస్తూ పోతే సోలో సినిమాలు మానేసాడని అనుకుంటారనో త్రినాధరావు నక్కినతో వెంకటేష్‌ సినిమా ఓకే చేసాడు. దీనిని సురేష్‌బాబే నిర్మిస్తాడని అనధికారిక సమాచారం. సినిమా చూపిస్త మావా, నేను లోకల్‌ చిత్రాలతో ఘన విజయాలు అందుకుని 'హలో గురు ప్రేమకోసమే'కి వచ్చేసరికి ఫార్ములా బోరు కొట్టేస్తోందని అనిపించుకున్న త్రినాధరావు ఇంతవరకు అన్నీ మామా అల్లుళ్ళ కాన్సెప్టులతోనే సినిమాలు తీసాడు.

మరి వెంకటేష్‌ హీరో అంటే అలాంటి యూత్‌ఫుల్‌ సబ్జెక్ట్‌ సెట్‌ అవదు కనుక ఈసారి పంథా మారుస్తాడనే అనుకోవచ్చు. నాగచైతన్యతో చేసే వెంకీ మామతో పాటు దీనిని కూడా సైమల్టేనియస్‌గా చేయాలని వెంకటేష్‌ డిసైడ్‌ అయ్యాడు. అంటే ఎఫ్‌ 2, వెంకీ మామతో పాటు ఇది కలిపి వచ్చే యేడాది వెంకటేష్‌ని అభిమానులు మూడుసార్లు వెండితెరపై వీక్షించవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English