ఇవేమి దిక్కుమాలిన చూపులు!?

ఇవేమి దిక్కుమాలిన చూపులు!?

'బిగ్‌బాస్‌' షోని తెలుగువాళ్లు ఆదరించారు కనుక హిందీలో క్లిక్‌ అయిన స్వయంవర్‌ షోని కూడా ఇక్కడికి దించేయాలని డిసైడ్‌ అయ్యారు. ఇంతవరకు బాగానే వుంది కానీ మొదటి స్వయంవరానికి తగ్గ వరుడ్ని ఎంచుకోవడంలో ఫెయిలయ్యారు. హీరో ఇమేజ్‌ వున్న వారిని ఎవరైనా వెతికి పట్టుకోకుండా టీవీ యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజుని తెచ్చి 'పెళ్లిచూపులు' మొదలు పెట్టారు. వినోదానికి ఎవరో ఒకరులే అనుకుంటూ ఈ షో చూడడం మొదలు పెట్టిన వారికి ఆదిలోనే చుక్కలు కనిపించాయి.

షోని ఎలాగైనా క్లిక్‌ చేయాలని అవసరం లేని మసాలా దట్టించి పారేయడంతో, ఎలాగైనా గుర్తింపుకి నోచుకోవాలని చూస్తోన్న అమ్మాయిలు తెగ రెచ్చిపోయారు. అక్కడికి ప్రదీప్‌ మాచిరాజు ఏదో టైమ్స్‌ మోస్ట్‌ డిజైర్డ్‌ మెన్‌లో నంబర్‌వన్‌ అయినట్టు అతడి కోసం అర్రులు చాచారు. ఇదంతా యాక్టింగ్‌ అనేది తేలిపోవడం, ఎలిమినేట్‌ అయిన అమ్మాయిలు ప్రదీప్‌కి అంత సీన్‌ లేదని అనేయడంతో ఇది డ్రామా అనేది ప్రేక్షకులకి క్లియర్‌ అయిపోయింది.

ఏదో గంట సేపు అతిథులతో కలిసి నవ్వించడానికి సరే కానీ 'మన్మథుడు' అన్నట్టుగా ప్రదీప్‌కి బిల్డప్పులు ఇవ్వడం మొత్తానికే తేడా కొట్టింది. దీంతో ఈ షోకి రేటింగ్స్‌ దారుణంగా వస్తున్నాయి. ఇవేమి దిక్కుమాలిన చూపులంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తూ వుండడంతో ఈ సీజన్‌ని ఎలాగోలా మ.మ. అనిపించేసి ఇక దీనిని స్క్రాప్‌ చేసేయాలని డిసైడ్‌ అయినట్టు బాగా వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English